Naga Chaitanya : నాగ చైతన్య 'దూత' ట్రైలర్ రిలీజ్.. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సూపర్బ్!
ఈ వార్తాకథనం ఏంటి
ఇటీవల స్టార్ హీరోలు, హీరోయిన్లు సైతం వైబ్ సిరీస్‌ల వైపు దృష్టి సారిస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా ఇదే బాటలో అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya) కూడా 'దూత' అనే వెబ్ సిరీస్ చేశారు.
డైరక్టర్ విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో మర్డర్స్ మిస్టరీ థ్రిల్లర్‌గా ఈ వెబ్ సిరీస్ ఉండనుంది.
మొదటిసారిగా చైతూ ఈ జోనర్‌లో నటిస్తుండటంతో ఈ సినిమాపై బారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇవాళ నాగ చైతన్య పుట్టినరోజు సందర్భంగా ట్రైలర్‌ను విడుదల చేశారు.
ట్రైలర్ చూస్తుంటే జర్నలిజం నేపథ్యంలో ఈ దూత సిరీస్ వస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో నాగ్ చైతన్య జర్నలిస్ట్ గా కనిపించనున్నాడు.
Details
డిసెంబర్ 1న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్
పలు న్యూస్ పేపర్లలో వచ్చే కటింగ్స్, కార్టూన్స్ ఆధారంగా కొన్ని హత్యలు జరుగుతున్నాయని నాగ చైతన్య గమనిస్తాడు.
అయితే జనాలకు దూతగా ఉండాల్సిన ఓ విలేకరి ఇంత పెద్ద ప్రమాదం నుండి ఎలా బయట పడ్డాడో తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే.
చైతూ ఈ సినిమాలో డిఫరెంట్‌గా కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రచి దేశాయ్, పార్వతి తిరువోతు, ప్రియా భవాని శంకర్, రవీంద్ర విజయ్ నటిస్తున్నారు.
దూత్ వెబ్ సిరీస్ డిసెంబర్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్(Amazon Prime) ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనున్నట్టు అధికారికంగా ప్రకటించారు.