Page Loader
Naga Chaitanya: మరో వెబ్‌ సిరీస్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నాగచైతన్య? పీఆర్వో టీం క్లారిటీ
మరో వెబ్‌ సిరీస్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నాగచైతన్య? పీఆర్వో టీం క్లారిటీ

Naga Chaitanya: మరో వెబ్‌ సిరీస్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నాగచైతన్య? పీఆర్వో టీం క్లారిటీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 15, 2024
01:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

అక్కినేని నాగచైతన్య ఇప్పటికే విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన 'దూత' వెబ్‌ సిరీస్‌ ద్వారా డిజిటల్ ప్లాట్‌ఫాంపై అడుగుపెట్టారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైన ఈ సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌ సిరీస్‌ 54వ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది. ఈ సిరీస్‌ విజయం తరువాత, నాగచైతన్య మరో వెబ్‌సిరీస్‌కు సంతకం చేశాడని జోరుగా వార్తలు విన్పిస్తున్నాయి. కానీ ఈ వార్తలపై నాగచైతన్య పీఆర్వో టీం స్పందించింది. చైతూ కొత్త వెబ్‌సిరీస్‌కు సంతకం చేశాడన్న వార్తలు పూర్తిగా అసత్యమని, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయొద్దని స్పష్టం చేసింది.

Details

'తండేల్' సినిమాపై ఫోకస్

ప్రస్తుతం నాగచైతన్య తన పూర్తిస్థాయి ఫోకస్‌ను 'తండేల్' సినిమాపై ఉంచాడని పీఆర్వో టీం ప్రకటన విడుదల చేసింది. తండేల్‌ సినిమా 2018లో గుజరాత్‌లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతోంది. ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో, బన్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో, ఫస్ట్‌ లుక్‌లో నాగచైతన్య మత్స్యకారుడిగా కనిపిస్తారు. సాయిపల్లవి శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన అమ్మాయి సత్య పాత్రలో నటిస్తోంది.