
Naga Chaitanya-Sobhita: ఘనంగా నాగచైతన్య, శోభితా హల్దీ వేడుక .. ఫొటోలు వైరల్
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ నటుడు నాగ చైతన్య, నటి శోభితా ధూళిపాళ్ల త్వరలో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు.
తాజాగా, ఈ జంటకు హల్దీ వేడుక ఘనంగా జరిగింది. సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ కార్యక్రమానికి కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.
వేడుకలో కాబోయే వధూవరులకు మంగళస్నానం నిర్వహించి, వారి ఆనందాన్ని పంచుకున్నారు.
ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
డిసెంబర్ 4న నాగచైతన్య, శోభిత వివాహం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరగనుంది.
వివరాలు
శోభితతో కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఎదురు చూస్తున్నాను: నాగచైతన్య
ఈ సందర్భంగా నాగచైతన్య ఇటీవల మీడియాతో మాట్లాడారు. "శోభితతో జీవితాన్ని పంచుకునేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. మా పెళ్లి సంప్రదాయబద్ధంగా, సాదాసీదాగా జరుగుతుంది. కార్యక్రమానికి ఆర్భాటం ఉండదు. పెళ్లి సంబంధించిన అన్ని అంశాలను మేమిద్దరం కలిసి నిర్ణయిస్తున్నాం" అని పేర్కొన్నారు.
అన్నపూర్ణ స్టూడియోస్‌పై వారి కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉందని నాగచైతన్య తెలిపారు.
"మా పెళ్లి తాతగారి విగ్రహం ముందు జరుగుతుంది. ఆయన ఆశీర్వాదాలు మా కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నాం. శోభితతో కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఎదురు చూస్తున్నాను. ఆమె నాకు ఎంతో తోడ్పాటు అందించింది. నా జీవితంలోని ఖాళీని ఆమె నింపుతుందని నాకు నమ్మకం" అని చెప్పారు.