Page Loader
Naga Chaitanya: లోకేశ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌ లో భాగం కావాలని ఉంది.. మనసులో మాట బయటపెట్టిన నాగచైతన్య 
లోకేశ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌ లో భాగం కావాలని ఉంది.. మనసులో మాట బయటపెట్టిన నాగచైతన్య

Naga Chaitanya: లోకేశ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌ లో భాగం కావాలని ఉంది.. మనసులో మాట బయటపెట్టిన నాగచైతన్య 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 31, 2025
11:13 am

ఈ వార్తాకథనం ఏంటి

'విక్రమ్' (Vikram), 'లియో' (Leo) వంటి చిత్రాలతో లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj) తన సినిమా యూనివర్సును (LCU) సృష్టించి విజయాన్ని సాధించారు. ఈ నేపథ్యంలో, స్టార్‌ హీరోలు కూడా ఈ యూనివర్సులో భాగం కావాలని ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల నటుడు నాగ చైతన్య, ఎల్‌సీయూ పై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. చెన్నైలో జరిగిన 'తండేల్‌' ఈవెంట్‌లో పాల్గొన్న నాగచైతన్య, ఎల్‌సీయూ తనకు చాలా నచ్చిందని, అందులో భాగం కావాలనే కోరికను వ్యక్తం చేశారు. ఆ తరువాత, ఆయన తన కోస్టార్‌ సాయిపల్లవి గురించి మాట్లాడారు. ఆమె ప్రతి ఒక్కరితో మర్యాదగా వ్యవహరిస్తారని, అందుకే అందరూ ఆమెను ప్రేమిస్తారని అన్నారు. ఆమెతో పని చేయాలని ప్రతిఒక్కరికీ ఉంటుంది అని చెప్పారు.

వివరాలు 

చైతన్య, సాయిపల్లవి యాక్టింగ్‌ పై కార్తీ ప్రశంసలు

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నటుడు కార్తి, 'తండేల్‌' చిత్రం విజయం సాధించాలని ఆకాంక్షించారు. ట్రైలర్‌ తనకు చాలా నచ్చిందని, చైతన్య, సాయిపల్లవి యాక్టింగ్‌ పై ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా సాయిపల్లవి గురించి మాట్లాడుతూ, ''మీ కథల ఎంపిక అద్భుతం. మీరు ప్రతీ పాత్రకు జీవం పోస్తారు. మీ నటనతో ఎంతోమంది ప్రేక్షకుల మనసులను కైవసం చేసుకున్నారు. 'ప్రేమమ్'లో మలార్ టీచర్‌, 'అమరన్'లో ఇందు పాత్రల్లో మీరు అద్భుతంగా నటించారు'' అని పేర్కొన్నారు. నిర్మాత అల్లు అరవింద్‌ మాట్లాడుతూ, తనకు సూర్యతో సినిమా చేయాలని ఉంది అని వెల్లడించారు.

వివరాలు 

అన్నీ కుదిరితే ,త్వరలోనే సూర్యతో సినిమా: అల్లు అరవింద్ 

''సూర్యతో నాకు చాలా కాలం నుండి మంచి అనుబంధం ఉంది.అతడితో సినిమా చేయాలని చాలా కాలం నుంచి కోరుకుంటున్నా.కానీ ఇది సాధ్యం కాలేదు.మా దర్శకుడు చందు మొండేటి ఇటీవల సూర్యకు కథ చెప్పాడు.అన్నీ కుదిరితే ,త్వరలోనే ఆ సినిమాకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తా'' అని తెలిపారు. వాస్తవ సంఘటనల ఆధారంగా అల్లుకున్న ఈ ప్రేమకథలో నాగచైతన్య రాజుగా, సాయిపల్లవి బుజ్జితల్లిగా కనిపించనున్నారు. ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. బన్నీవాసు నిర్మాతగా, అల్లు అరవింద్‌ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలు ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.