Page Loader
Thandel: ఎట్టకేలకు తండేల్ రిలీజ్ డేట్ చెప్పేశారు.. ఎప్పుడంటే?
ఎట్టకేలకు తండేల్ రిలీజ్ డేట్ చెప్పేశారు.. ఎప్పుడంటే?

Thandel: ఎట్టకేలకు తండేల్ రిలీజ్ డేట్ చెప్పేశారు.. ఎప్పుడంటే?

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 05, 2024
05:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

నాగ చైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న తాజా చిత్రం తండేల్. ఈ చిత్రాన్ని చందు మొండేటి దర్శకత్వంలో, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. కథాంశం: శ్రీకాకుళం జిల్లాకు చెందిన జాలర్ల బృందం గుజరాత్‌లో చేపల వేటకు వెళ్లి పాకిస్తాన్ నేవీ చేతికి చిక్కిపోతుంది. ఈ సంఘటన నేపథ్యంలో ఆ జాలర్ల బృందం జైలు శిక్ష అనుభవించి, ఎప్పుడు, ఎలా భారతదేశానికి తిరిగి వచ్చింది అనే ఆసక్తికరమైన కథను ఈ సినిమాలో చూపించనున్నారు.

వివరాలు 

ఫిబ్రవరి 7 2025న విడుదల

మరో ప్రత్యేకమైన అంశం ఏమిటంటే, ఈ కథను స్వయంగా ఆ సంఘటనలో చిక్కుకుపోయిన ఒక యువకుడు అందించడం విశేషం. కార్తీక్ అనే యువకుడు చెప్పిన ఈ కథను, చందు మొండేటి దర్శకత్వం వహిస్తూ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి గీతా ఆర్ట్స్ ముందుకు వచ్చింది. రిలీజ్ సమాచారం: ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయింది. తొలుత డిసెంబర్ 20న విడుదల చేయాలని భావించినా, షూటింగ్ పూర్తి కాకపోవడంతో సంక్రాంతికి విడుదల చేస్తారని ఊహాగానాలు వచ్చాయి. అయితే, తాజాగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో, సినిమా యూనిట్ ఫిబ్రవరి 7న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మేకర్స్ చేసిన ట్వీట్