LOADING...
INCA Awards: బెస్ట్ యాక్టర్‌గా నాగచైతన్యకు అవార్డ్..INCA విజేతలు వీరే
బెస్ట్ యాక్టర్‌గా నాగచైతన్యకు అవార్డ్..INCA విజేతలు వీరే

INCA Awards: బెస్ట్ యాక్టర్‌గా నాగచైతన్యకు అవార్డ్..INCA విజేతలు వీరే

వ్రాసిన వారు Moogati Shabari
Apr 09, 2026
11:25 am

ఈ వార్తాకథనం ఏంటి

యువ నటుడు అక్కినేని నాగ చైతన్యకు మరో గొప్ప గౌరవం దక్కబోతోంది. 'తండేల్' చిత్రంలో అతను చూపించిన అద్భుత నటనకు గాను 'ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ' (INCA 2026) అవార్డుల్లో ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు. అదే విధంగా 'ది గర్ల్‌ఫ్రెండ్‌' సినిమాలో నటించిన రష్మిక మంధాన్న ఉత్తమ నటి అవార్డుకు ఎంపికైంది. ముందుగా ఈ ఇద్దరూ 'తెలంగాణ గద్దర్ అవార్డ్స్'లో కూడా ఉత్తమ నటీనటులుగా గౌరవం అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అదే కేటగిరీలో INCA అవార్డ్స్‌లో కూడా విజేతలుగా నిలవడం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం.ఆ

వివరాలు

అవార్డులు తీసుకోబోయేది వీరే..

ప్రతి సంవత్సరం దేశంలోని పన్నెండు సినీ రంగాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చే 'ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ' ఈ అవార్డులను అందజేస్తుంది. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వంటి మొత్తం 12 భాషల్లో ఈ పురస్కారాలు ప్రకటించబడతాయి. INCA 2026 అవార్డుల్లో గత సంవత్సరం విడుదలైన చిత్రాల నుంచి ఉత్తమ సినిమాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులను ఎంపిక చేశారు. తెలుగు విభాగంలో 'తండేల్' సినిమాకుగాను నాగచైతన్య ఉత్తమ నటుడిగా, 'ది గర్ల్‌ఫ్రెండ్‌' చిత్రానికి రష్మిక ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రానికి అనిల్ రావిపూడి ఉత్తమ దర్శకుడిగా నిలిచారు. అదే సినిమాలో నటించిన మాస్టర్ రేవంత్ (బుల్లిరాజు) ఉత్తమ హాస్యనటుడిగా అవార్డు అందుకున్నాడు.

వివరాలు

ఇతర భాషల్లో అవార్డు గెలిచిన చిత్రాలు

తేజ సజ్జా హీరోగా కార్తీక్ ఘట్టమనేని రూపొందించిన 'మిరాయ్' చిత్రం ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఈ చిత్రానికి ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో కూడా అవార్డు లభించింది. ఉత్తమ తొలి దర్శకుడిగా 'కోర్ట్' చిత్రానికి రామ్ జగదీష్ విజేతగా నిలిచాడు. తమిళ చిత్రాల్లో 'కాంత' సినిమాకుగాను దుల్కర్ సల్మాన్ ఉత్తమ నటుడిగా, 'టూరిస్ట్ ఫ్యామిలీ' చిత్రానికి సిమ్రాన్ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. అలాగే మారి సెల్వరాజ్ 'బైసన్' చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా నిలిచాడు. 'టూరిస్ట్ ఫ్యామిలీ'నే ఉత్తమ చిత్రంగా ఎంపిక చేశారు. కన్నడ చిత్రాల్లో 'కాంతార: చాప్టర్ 1' సినిమాకు రిషబ్ శెట్టి ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు అవార్డులు గెలుచుకోగా, రుక్మిణి వసంత్ ఉత్తమ నటి అవార్డు అందుకుంది.

Advertisement

వివరాలు

ముంబైలో అవార్డుల ప్రదానోత్సవం

INCA అవార్డ్స్ ప్రదానోత్సవం ఏప్రిల్ 16న ముంబైలో నిర్వహించబడనుంది. ఈ కార్యక్రమాన్ని టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటి, బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ హోస్ట్ చేయనున్నారు. సీనియర్ నటి రేఖ, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తదితర సినీ ప్రముఖులు, అలాగే అవార్డు గ్రహీతలు ఈ వేడుకలో పాల్గొననున్నారు. తెలుగు విభాగం విజేతలు: ఉత్తమ నటుడు - నాగచైతన్య (తండేల్) ఉత్తమ నటి - రష్మిక మందన్న (ది గర్ల్‌ఫ్రెండ్‌) ఉత్తమ దర్శకుడు - అనిల్ రావిపూడి (సంక్రాంతికి వస్తున్నాం) ఉత్తమ చిత్రం - మిరాయ్ ఉత్తమ హాస్యనటుడు - రేవంత్ (సంక్రాంతికి వస్తున్నాం)

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న పోస్ట్: 

Advertisement