LOADING...
Thandel: కలెక్షన్స్‌తో బాక్సాఫీస్ ను కుమ్మేస్తున్న'తండేల్' .. రూ.100 కోట్ల దిశ‌గా..
కలెక్షన్స్‌తో బాక్సాఫీస్ ను కుమ్మేస్తున్న'తండేల్' .. రూ.100 కోట్ల దిశ‌గా..

Thandel: కలెక్షన్స్‌తో బాక్సాఫీస్ ను కుమ్మేస్తున్న'తండేల్' .. రూ.100 కోట్ల దిశ‌గా..

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 15, 2025
04:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన "తండేల్" సినిమా బాక్సాఫీస్‌ను కుదిపేస్తోంది. ఇప్పటికే రూ.70 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం, వీకెండ్ ముగిసేలోపు రూ.100 కోట్ల మార్క్‌ను దాటే దిశగా దూసుకెళ్తోంది. తాజాగా, ఈ సినిమా రూ.95 కోట్ల మార్క్‌ను అధిగమించిందని చిత్రబృందం ప్రకటించింది. శనివారం, ఆదివారం కలిసివస్తుండటంతో క‌లెక్ష‌న్లు మరింత పెరిగే అవకాశం ఉంది. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్, బన్నీ వాసు నిర్మించారు.

వివరాలు 

కథా విషయానికి వస్తే... 

శ్రీకాకుళం జిల్లాలోని మత్స్యలేశ్యం గ్రామానికి చెందిన రాజు (నాగచైతన్య),సత్య (సాయి పల్లవి) చిన్ననాటి నుంచి కలిసి పెరిగిన మత్స్యకారుల కుటుంబాలకు చెందినవారు. ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ,జీవితాన్ని కలిసి గడపాలనుకుంటారు.రాజు చేపల వేటకు వెళ్లి నెలల తరబడి ఇంటికి రాకపోయినా,అతని జ్ఞాపకాలతోనే బతుకుతుంటుంది సత్య. రాజు తన కుటుంబానికి అండగా నిలబడే ధైర్యం,మంచితనం,సమాజ సేవ వంటి గుణాలతో, తన జాతికి "తండేల్"‌గా మారతాడు. అయితే,సముద్రంలో తనవాళ్లు ప్రాణాలు కోల్పోతున్న దృశ్యాలను చూస్తూ సత్య మనసులో భయం మొదలవుతుంది. రాజును వేట మాన్పించాలని కోరుతుంది. కానీ రాజు మాత్రం తన బాధ్యతను వదులుకోలేడు. సత్య మాటను పట్టించుకోకుండా చేపల వేటకు వెళ్తాడు. మనసుకు బాధ కలిగిన సత్య, రాజును మరిచిపోవాలని, మరొకరితో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది.

వివరాలు 

ఇక అసలు కథ మొదలవుతుంది... 

అయితే అనుకోని మలుపులో, చేపల వేటకు వెళ్లిన రాజు బృందం తుఫాన్‌లో చిక్కుకుని, పొరపాటున పాకిస్తాన్ సముద్ర జలాల్లో ప్రవేశిస్తుంది. అక్కడి నేవీ వారిని అరెస్టు చేస్తుంది. ఈ వార్త విన్న మత్స్యలేశ్యం గ్రామం తల్లడిల్లిపోతుంది. సత్య ఒక్కసారిగా షాక్‌కు గురవుతుంది. పాకిస్తాన్ కరాచీ సెంట్రల్ జైలులో బంధీలుగా మారిన రాజు బృందం ఎలా బయటపడింది? సత్య నిజంగానే వేరొకరిని పెళ్లి చేసుకున్నదా? రాజును విడిపించేందుకు ఆమె ఏం చేసింది? చివరికి రాజు, సత్య ప్రేమకథ సుఖాంతమైందా లేక సుఖాంతమైందా? ఈ ప్రశ్నలకు సమాధానం వెండితెరపై చూడాల్సిందే!

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్