Page Loader
VD12: VD12 టైటిల్ అప్డేట్.. 'సామ్రాజ్యం' అనే టైటిల్ ఫిక్స్..?
టైటిల్ అప్డేట్.. 'సామ్రాజ్యం' అనే టైటిల్ ఫిక్స్..?

VD12: VD12 టైటిల్ అప్డేట్.. 'సామ్రాజ్యం' అనే టైటిల్ ఫిక్స్..?

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 31, 2025
12:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఈసారి సాలిడ్ కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు అని, వీడీ 12 సినిమా ప్రారంభమైనప్పటి నుంచి ఇండస్ట్రీ సర్కిల్స్‌లో చర్చలు జరుగుతున్నాయి. విజయ్‌తో గౌతమ్ తిన్ననూరి ఒక భారీ సినిమాను చేస్తున్నారని చిత్ర యూనిట్ తరఫున సమాచారం అందుతోంది. ముఖ్యంగా నిర్మాత నాగవంశీ గతంలో పలుమార్లు చెప్పారు, "వీడీ 12, నెక్స్ట్ లెవల్ సినిమాగా ఉంటుంది, బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టడం గ్యారెంటీ" అని. ఈ మాటలకు తగినట్టు, ఇప్పటి వరకు విడుదలైన విజయ్ లుక్స్ రౌడీ ఫ్యాన్స్‌లో మంచి అంచనాలు ఏర్పరచినట్లు తెలుస్తోంది...?

వివరాలు 

వీడీ 12 టైటిల్‌పై నిర్మాత అప్డేట్

ఈ సినిమాతో విజయ్ సాలిడ్ కంబ్యాక్ అవుతాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అయితే, ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, రిలీజ్ డేట్ గురించి క్లారిటీ లేదు. అయితే, ఇటీవల నాగవంశీ తన సోషల్ మీడియా వేదికపై వీడీ 12 టైటిల్‌పై అప్డేట్ ఇచ్చారు. "మీ అందరి అబ్యూసెస్ తరువాత, నేను గౌతమ్‌ని చాలా హింస పెట్టాక, చివరికి వీడీ 12 టైటిల్‌ను లాక్ చేశాం. త్వరలోనే టైటిల్‌ని రివీల్ చేస్తాం" అని ఆయన తెలిపారు. దీంతో రౌడీ ఫ్యాన్స్ టైటిల్ ఏంటో తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

వివరాలు 

టైటిల్ గా 'సామ్రాజ్యం' 

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమాకు 'సామ్రాజ్యం' అనే టైటిల్ ఖరారైంది. ఫిబ్రవరి మొదటి వారంలో టైటిల్ రివీల్ చేయనున్నారు. అలాగే, టైటిల్‌తో పాటు ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ కూడా ప్రకటించే అవకాశముంది. మార్చి 28న ఈ సినిమా విడుదల అయ్యే అవకాశమున్నా, వాయిదా పడే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంలో స్పష్టత రానుంది. మరి ఈ సినిమాతో రౌడీ విజయ్ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.