Loading...
Naga Bandham Review : 'నాగబంధం' మూవీ రివ్యూ
'నాగబంధం' మూవీ రివ్యూ

Naga Bandham Review : 'నాగబంధం' మూవీ రివ్యూ

వ్రాసిన వారు Moogati Shabari
Jul 03, 2026
09:54 am

ఈ వార్తాకథనం ఏంటి

స్టార్ హీరోలు లేకపోయినా, స్టార్ దర్శకుడు కాకపోయినా, కేవలం తన అద్భుతమైన విజువల్స్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన చిత్రం 'నాగబంధం'. ట్రైలర్ విడుదలైన తర్వాత ఈ సినిమాపై ఒక్కసారిగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అభిషేక్ నామా దర్శకత్వంలో విరాట్ కర్ణ హీరోగా, నభా నటేష్ కథానాయికగా రూపొందిన ఈ పాన్ ఇండియా చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ఒక రోజు ముందే మీడియా కోసం ప్రత్యేక ప్రీమియర్ ప్రదర్శించగా, సినిమా ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

వివరాలు

కథ ఏంటంటే..

మరణాన్నే జయించే అపూర్వ శక్తి కలిగిన 'బ్రహ్మకమలం' అనే దివ్య వస్తువు చుట్టూ ఈ కథ నడుస్తుంది.

1962 కాలంలో పురావస్తు శాస్త్రవేత్త ప్రభాకర్ (జగపతిబాబు) అరుదైన చారిత్రక రహస్యాలపై పరిశోధనలు చేస్తుంటాడు.

ఈ క్రమంలో ఒక రహస్య గ్రంథం ద్వారా అనంత పద్మనాభస్వామి ఆలయంలో విష్ణుమూర్తి వద్ద దాగి ఉన్న బ్రహ్మకమలం గురించి తెలుసుకుంటాడు.

ప్రపంచాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవాలనే లక్ష్యంతో ఉన్న అలీ (రిషబ్ సహానీ) ఆ బ్రహ్మకమలాన్ని సొంతం చేసుకోవడానికి ప్రమాదకరమైన కుట్రలు పన్నుతాడు.

బ్రహ్మకమలం, నాగబంధం రహస్యం మధ్య ఉన్న సంబంధం ఏమిటి?

అలీ తన లక్ష్యాన్ని చేరుకున్నాడా? కుటుంబాన్ని కోల్పోయిన రుద్ర తన శత్రువులను ఎలా ఎదుర్కొన్నాడు? అనే ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.

వివరాలు

భావోద్వేగాలతో కూడిన ట్విస్ట్..

టీజర్, ట్రైలర్ విడుదలైనప్పటి నుంచే ఈ సినిమాపై భారీ హైప్ ఏర్పడింది.

ప్రముఖ తారాగణం లేకపోయినా, భారీ నిర్మాణ విలువలు, గ్రాండ్ సెట్స్, అనంత పద్మనాభస్వామి ఆలయ నేపథ్యం, డివోషనల్ థ్రిల్లర్ అనే ప్రచారం సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి.

మొదటి భాగం ప్రధానంగా 1962 నేపథ్యంలో సాగుతుంది. బ్రహ్మకమలం, నాగబంధం కోసం వివిధ వ్యక్తులు చేసే ప్రయత్నాలు, రుద్ర కుటుంబానికి సంబంధించిన సంఘటనలతో కథ నెమ్మదిగా ముందుకు కదులుతుంది.

ఇంటర్వెల్‌కు ముందు వచ్చే యాక్షన్, భావోద్వేగాలతో కూడిన ట్విస్ట్ ప్రేక్షకుల్లో రెండో భాగంపై ఆసక్తిని పెంచుతుంది.

రెండో భాగంలో రుద్ర బ్రహ్మకమలం అన్వేషణలో భాగంగా అనేక ఆశ్చర్యకరమైన నిజాలను తెలుసుకుంటాడు. ఊహించని మలుపులు ఆకట్టుకుంటాయి.

ADVERTISEMENT

వివరాలు

నటనతో అదరగొట్టారిలా..

రుద్ర పాత్రలో విరాట్ కర్ణ తన నటనతో ఆకట్టుకున్నాడు. సాధారణ యువకుడిగా, మరోవైపు సాధువు పాత్రలో రెండు విభిన్న కోణాలను సమర్థంగా ఆవిష్కరించాడు.

యాక్షన్ సన్నివేశాల్లో మంచి ప్రతిభ కనబరిచినా, ఇలాంటి భారీ స్థాయి చిత్రాన్ని ఒంటరిగా మోయగల స్టార్ ఇమేజ్ మాత్రం ఇంకా ఏర్పడాల్సి ఉంది.

నభా నటేష్ ద్విపాత్రాభినయంతో ఆశ్చర్యపరిచింది. ఆమె పాత్రకు సంబంధించిన ట్విస్ట్ సినిమాకు అదనపు బలాన్ని ఇచ్చింది.

పురావస్తు శాస్త్రవేత్త ప్రభాకర్‌గా జగపతిబాబు తన అనుభవాన్ని మరోసారి చాటుకున్నారు.

బైరాగి పాత్రలో గరుడ రామ్ తన ప్రత్యేక నటనతో భయానకతను సమర్థంగా ప్రదర్శించాడు.

విలన్‌గా రిషబ్ సహానీ క్రూరత్వాన్ని సమర్థంగా చూపించాడు. అనసూయ, ఐశ్వర్య మీనన్, మురళీ శర్మ తమ పాత్రల పరిధిలో చక్కగా నటించారు.

ADVERTISEMENT