Loading...
King 100: నాగార్జున 100వ సినిమా.. ఆగస్టు 29న ఫస్ట్‌ లుక్‌, గ్లింప్స్
నాగార్జున 100వ సినిమా.. ఆగస్టు 29న ఫస్ట్‌ లుక్‌, గ్లింప్స్

King 100: నాగార్జున 100వ సినిమా.. ఆగస్టు 29న ఫస్ట్‌ లుక్‌, గ్లింప్స్

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 11, 2026
09:52 am

ఈ వార్తాకథనం ఏంటి

అక్కినేని నాగార్జున కెరీర్‌లో 100వ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆయన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమిళ దర్శకుడు రా కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్‌ నటి టబు పవర్‌ఫుల్ విలన్‌ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. దాదాపు 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత నాగార్జున, టబు మరోసారి కలిసి నటిస్తుండటం ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తిని మరింత పెంచుతోంది. ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్‌, సుస్మితా భట్‌, విజయేంద్ర తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ దశలో ఉంది. గత కొన్ని నెలలుగా చిత్రీకరణ కొనసాగుతున్నప్పటికీ.. ఇప్పటివరకు మూవీకి సంబంధించిన ఒక్క అధికారిక లుక్‌ కూడా బయటకు రాలేదు.

వివరాలు

ప్రేక్షకుల్లో మరింత హైప్

దీంతో ఈ ప్రాజెక్ట్‌ చుట్టూ ఉన్న సస్పెన్స్‌ మరింత పెరిగింది.

సాధారణంగా స్టార్‌ హీరోల సినిమాలకు సంబంధించి వరుసగా పోస్టర్లు, ఫస్ట్‌ లుక్స్‌, టీజర్లు విడుదల చేస్తూ ప్రేక్షకుల్లో హైప్‌ పెంచుతుంటారు.

అయితే నాగార్జున 100వ సినిమా విషయంలో మేకర్స్‌ అందుకు భిన్నమైన వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. సినిమా షూటింగ్‌ కొనసాగుతున్నా.. కథ, పాత్రలు, ఇతర వివరాలపై నిర్మాతలు పెద్దగా సమాచారం బయటకు వెల్లడించడం లేదు.

ఇప్పటివరకు కనీసం ఒక్క అధికారిక లుక్‌ కూడా విడుదల చేయకపోవడంతో అభిమానుల్లో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.

అయితే ఈ ఎదురుచూపులకు త్వరలోనే తెరపడనుంది. నాగార్జున పుట్టినరోజైన ఆగస్టు 29న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌తో పాటు ప్రత్యేక గ్లింప్స్‌ను విడుదల చేసేందుకు చిత్రబృందం సిద్ధమవుతున్నట్లు సమాచారం.

ADVERTISEMENT