ఓటీటీలోకి వచ్చేస్తున్న నాగశౌర్య రీసెంట్ మూవీ రంగబలి: స్ట్రీమింగ్ ఎక్కడంటే?
నాగశౌర్య, యుక్తి తరేజా హీరో హీరోయిన్లుగా నటించిన రంగబలి సినిమా, జులై 7న థియేటర్లలో రిలీజై మంచి టాక్ సొంతం చేసుకుంది. పవన్ బాసం శెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. నెట్ ఫ్లిక్స్ వేదికగా ఆగస్టు 4వ తేదీ నుండి స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో మురళీ శర్మ, టామ్ షైన్ చాకో, కమెడియన్ సత్య, గోపరాజు రమణ కీలక పాత్రల్లో కనిపించారు. పవన్ సి హెచ్ సంగీతం అందించిన ఈ సినిమాను ఎస్ఎల్వీ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు.
రంగబలి కథేంటంటే?
రాజవరం అనే ఊరిలో అల్లరి చిల్లరగా తిరిగే కుర్రాడు షో(నాగశౌర్య)కి తన ఊరంటే చాలా ఇష్టం. ఊరు దాటి వెళ్ళడం అతనికి ఇష్టం ఉండదు. కానీ అనుకోని కారణాల వల్ల విశాఖపట్నం వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ సహజ(యుక్తి తరేజా) కలుస్తుంది. వాళ్ళిద్దరూ ప్రేమలో పడతారు. అయితే సహజను పెళ్ళి చేసుకోవాలంటే రాజవరం ఊరిని వదిలేసి రావాలంటాడు సహజ తండ్రి. సహజ తండ్రి అలా ఎందుకు చెప్పాడు? నాగశౌర్య పాత్రకు రాజవరం ఊరిలో ఉన్న రంగబలి సెంటర్ కు సంబంధం ఏంటి? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.