Page Loader
Pallavi Prashant: పల్లవి ప్రశాంత్ కు బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు 
పల్లవి ప్రశాంత్ కు బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు

Pallavi Prashant: పల్లవి ప్రశాంత్ కు బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 22, 2023
06:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్‌తోపాటు అతని సోదరుడికి కోర్టు నాంపల్లి కోర్టు శుక్రవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పోలీసుల ఎదుట ఆదివారం విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. అలాగే రూ. 15 వేల చొప్పున రెండు షూరిటీలు సమర్పించాలని నాంపల్లి కోర్టు పల్లవి ప్రశాంత్ ను ఆదేశించింది. బిగ్ బాస్ ముగింపు సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ వెలుపల అతని అభిమానులు చేసిన ఆందోళన నేపథ్యంలో ప్రశాంత్‌ను రెండు రోజుల క్రితం అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రాథమిక నిందితుడు (A1)గా ఉన్న అతడు చంచల్‌గూడ జైలులో 14 రోజుల రిమాండ్‌లో ఉన్నాడు.

Details 

ఘటనలో కొన్ని పోలీసుల వాహనాలు, ప్రయివేటు వాహనాలు, గవర్నమెంట్ బస్ అద్దాలు ధ్వంసం 

బెయిల్ కోరుతూ, నాంపల్లి కోర్టులో ప్రశాంత్ తన పిటిషన్‌ను సమర్పించగా, కేసు విచారణ అనంతరం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. బిగ్ బాస్ ఫైనల్ కంటెస్టెంట్స్ ఆదివారం బయటికి వస్తున్న సమయంలో ప్రశాంత్ ఫ్యాన్స్ అమర్ దీప్, అశ్విని, గీతూ, హర్ష, బోలే కార్ల అద్దాలు పగలకొట్టి వారిని అసభ్య పదజాలతో దూషించారు. ప్రశాంత్ కూడా పోలీసుల మాట వినకుండా ఊరేగింపుగా వెళ్లడంతో అతని ఫ్యాన్స్ మరింత రెచ్చిపోయారు. ఈ మొత్తం ఘటనలో కొన్ని పోలీసుల వాహనాలు, ప్రయివేటు వాహనాలు, గవర్నమెంట్ బస్ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రశాంత్ A1 గా, అతని తమ్ముడిని A2గా చేర్చారు.