SSMB29: మహేష్ బాబు సినిమాలో విలన్‌గా నానా పటేకర్?
ఈ వార్తాకథనం ఏంటి
సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా, దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 29వ సినిమా ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే.
'ఆర్‌ఆర్‌ఆర్' ఘన విజయం తర్వాత జక్కన్న తెరకెక్కిస్తున్న ఈ చిత్రం గురించి రోజుకో వార్త నెట్టింట హల్‌చల్ చేస్తూనే ఉంది.
ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.
బాలీవుడ్ సీనియర్ నటుడు నానా పటేకర్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. చిత్ర బృందం ప్రస్తుతం ఆయనతో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Details
కథను అందిస్తున్న విజయేంద్ర ప్రసాద్
అంతేకాదు, మరో ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్ పేరును కూడా ఓ ముఖ్యమైన పాత్ర కోసం పరిశీలించినట్టు సమాచారం.
దీనిపై పృథ్వీరాజ్ స్వయంగా స్పందించి, చర్చలు జరిగిన మాట వాస్తవమేనని పేర్కొన్నారు. ఈ చిత్రం పూర్తిగా అడ్వెంచర్ నేపథ్యంలో సాగనుంది.
ప్రపంచాన్ని చుట్టే అద్భుతమైన యాక్షన్ జర్నీగా రాజమౌళి దీనిని రూపొందిస్తున్నారు.
మహేశ్‌బాబు ఇప్పటివరకు చేయని రీతిలో నటించనున్నారని టాక్. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా కీరవాణి పని చేస్తున్నారు.
కథను విజయేంద్ర ప్రసాద్ అందించగా, దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కె.ఎల్. నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు