NBK 111 : బాలయ్య కొత్త సంచలనానికి కౌంట్‌డౌన్ ప్రారంభం.. అభిమానులకు భారీ సర్‌ప్రైజ్ రెడీ
ఈ వార్తాకథనం ఏంటి
'వీరసింహారెడ్డి'తో ఘన విజయాన్ని అందుకున్న నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేనితో మరోసారి చేతులు కలిపిన విషయం తెలిసిందే. ఈ క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న తాజా చిత్రం బాలకృష్ణ కెరీర్‌లో 111వ సినిమాగా తెరకెక్కుతోంది. ముంబయి బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత వెంకట సతీశ్ కిలారు ఎలాంటి రాజీ పడకుండా ఈ ప్రాజెక్ట్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకెళ్తున్నారు.
వివరాలు
గ్యాంగ్‌స్టర్ అవతారంలో బాలయ్య..
ఈ సినిమాలో బాలకృష్ణ ఇప్పటివరకు కనిపించని స్థాయిలో శక్తివంతమైన పాత్రలో దర్శనమివ్వనున్నారని సమాచారం. ముఖ్యంగా ఆయన గ్యాంగ్‌స్టర్ అవతారంలో ప్రేక్షకులను ఆకట్టుకోబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరోవైపు హీరో మంచు మనోజ్ ఈ చిత్రంలో ప్రధాన ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. బాలయ్యకు సవాల్ విసిరే బలమైన విలన్ పాత్రలో ఆయన నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, నందమూరి బాలకృష్ణ జన్మదినోత్సవం సందర్భంగా అభిమానులకు అదిరిపోయే అప్డేట్‌ను చిత్రబృందం ప్రకటించింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు వేచిచూడాల్సిన సమయం ముగిసింది.
వివరాలు
తెలుగు సినీ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది..
బాలయ్య 111వ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు ప్రత్యేక గ్లింప్స్‌ను ఈ రోజు సాయంత్రం 5:40 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. "తెలుగు సినీ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలికే సమయం ఆసన్నమైంది. గతంలో ఎప్పుడూ చూడని స్థాయిలో వేడుకలు జరుపుకునేందుకు సిద్ధంగా ఉండండి" అంటూ చిత్రబృందం అభిమానుల్లో ఉత్సాహాన్ని మరింత పెంచింది. ఈ ప్రకటనతో సోషల్ మీడియాలో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.
వివరాలు
బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు..
బాలకృష్ణ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, గోపీచంద్ మలినేని మాస్ ట్రీట్‌మెంట్ కలిస్తే ప్రేక్షకులకు పూర్తి స్థాయి ఎంటర్‌టైన్‌మెంట్ లభించడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాకుండా సంగీత దర్శకుడు ఎస్.ఎస్. థమన్ అందించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరింత బలం చేకూర్చనుంది. యాక్షన్, ఎమోషన్, మాస్ ఎలిమెంట్స్ సమ్మేళనంగా రూపొందుతున్న ఈ చిత్రం విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డుల దిశగా దూసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.