Daaku Maharaaj: బాలయ్య సిగ్నేచర్ డైలాగ్ తో.. డాకు మహారాజ్ ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్
నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 'డాకు మహారాజ్' చిత్రాన్ని బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ విజువల్స్ సినిమాకు మంచి అంచనాలను ఏర్పరచాయి. ఈ నేపథ్యంలో, (డిసెంబర్ 13న) విడుదలైన డాకు మహారాజ్ ఫస్ట్ సింగిల్ ప్రోమో మరింత అంచనాలను పెంచింది. 'డాకు రేజ్ లిరికల్' అనే పేరుతో వచ్చిన ఈ ప్రోమో ప్రేక్షకులను అద్భుతంగా ఆకర్షిస్తోంది.
బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, ట్యూన్ గూస్ బంప్స్
"డేగ డేగ" అనే పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా, నకాష్ అజీజ్ పాడారు. ఈ పాట సౌండ్, పాటల లిరిక్స్ మాస్ ఎనర్జీతో వర్ణించబడింది. 'మాస్ విధ్వంసం స్పష్టించేలా.. సౌండ్ వరల్డ్ ఆఫ్ డాకు' అనే విధంగా సాంగ్ బ్లాస్ట్ అయ్యే లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, ట్యూన్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. మాస్ అనే పదానికి పర్ఫెక్ట్ ఎగ్జామ్పుల్ బాలకృష్ణ అని మరోసారి చెప్పేలా ఉంది. డాకు మహారాజ్లో బాలయ్య ఊచకోత తప్పదనేలా ఫస్ట్ సింగిల్ ప్రోమో చెబుతోంది.
అదిరిపోయిన బాలయ్య ఎంట్రీ డైలాగ్స్
గతంలో విడుదలైన గ్లింప్స్ కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేలా ఉన్నాయి. "ఈ కథ వెలుగును పంచే దేవుళ్లది కాదు.. చీకటిని శాసించే రాక్షసులది కాదు.. ఆ రాక్షసులను ఆడించే రావణుడిది కాదు.. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఓ రాజుది.. గంద్ర గొడ్డలి పట్టిన యమధర్మ రాజుది.. మరణాన్నే వణికించిన మహారాజుది" అన్నది బాలయ్య ఎంట్రీ గురించి చెప్పే పదాలు, కథపై మరింత ఆసక్తిని కలిగిస్తున్నాయి. అలాగే, 'సింహం నక్కల మీద వస్తే.. వార్ అవ్వదురా లఫూట్.. హంటింగ్' అనే బాలయ్య సిగ్నేచర్ డైలాగ్, ఫ్యాన్స్‌కు ఆసక్తిని కలిగిస్తూ, వారి మస్క్యులిన్ ఇమేజ్‌ను మరింత బలపరుస్తుంది. ఈ సినిమా ద్వారా బాలకృష్ణ ఏ రీతిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడో చూడాలి.
సంక్రాంతి కానుకగా విడుదల
ఈ చిత్రంలో 'యానిమల్'తో ప్రేక్షకులను మెప్పించిన బాబీ డియోల్ విలన్ పాత్రలో నటించనున్నారు. బాలకృష్ణకు జోడిగా శ్రద్ధా శ్రీనాథ్ నటించనున్నారు. 'వాల్తేరు వీరయ్య' చిత్రంతో పాటు పలువురి స్పెషల్ సాంగ్స్ చేసిన ఊర్వశీ రౌతేలా కూడా ఈ చిత్రంలో స్పెషల్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. డాకు మహారాజ్ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా 2025 సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. ఈ చిత్రానికి సంగీతం తమన్ అందిస్తున్నారు.