Page Loader
డెవిల్ గ్లింప్స్ వీడియో రిలీజ్ కు రేపే ముహుర్తం.. టైప్ రైటర్ తో స్పై థ్రిల్లర్‌ వీడియో విడుదల
టైప్ రైటర్ తో స్పై థ్రిల్లర్‌ వీడియో విడుదల

డెవిల్ గ్లింప్స్ వీడియో రిలీజ్ కు రేపే ముహుర్తం.. టైప్ రైటర్ తో స్పై థ్రిల్లర్‌ వీడియో విడుదల

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 04, 2023
04:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ డెవిల్ చిత్రం నుంచి అప్‌డేట్‌ వచ్చింది. గత కొంతకాలంగా ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఎప్పుడెప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు చిత్ర యూనిట్ తాజా కబురు అందించింది. ఈ నేపథ్యంలో డెవిల్‌ గ్లింప్స్ వీడియోను బుధవారం విడుదల చేస్తున్నట్టు నిర్మాణ బృందం ప్రకటించింది. ఈ మూవీకి నవీన్ మేడారం దర్శకత్వం వహిస్తున్నారు. పీరియాడిక్ స్పై థ్రిల్లర్‌ (బ్రిటీష్ కాలం నాటి గూడచర్యం) కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బింబిసార బ్లాక్ బస్టర్ హిట్‌ తర్వాత నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ నుంచి వస్తున్న చిత్రం డెవిల్ (Devil - The British Secret Agent) కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి.

DETAILS

టైప్ రైటర్‌తో వచ్చిన డెవిల్ వీడియో ఒకటి నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది 

గతంలో రిలీజైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ నెట్టింట ఉత్కంఠని రేపింది. గత కొన్నాళ్లుగా ఈ మూవీకి సంబంధించిన ఎలాంటి అప్‌డేట్స్ లేకపోవడంతో ఫిల్మ్ లవర్స్ నిరీక్షించారు. ప్రస్తుతం టైప్ రైటర్‌తో వచ్చిన డెవిల్ వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది. ఇటీవలే డెవిల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని దేవాన్ష్‌ నామా సమర్పిస్తుండగా, అభిషేక్ పిక్చర్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్‌ నామా నిర్మిస్తున్నారు. మరోవైపు కథ, స్క్రీన్‌ ప్లే, డైలాగ్స్ లను శ్రీకాంత్ విస్సా అందిస్తుండగా, హర్షవర్దన్ రామేశ్వర్‌ మ్యూజిక్ అందిస్తున్నాడు. డెవిల్‌ను తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో చిత్రీకరించారు. బింబిసార విజయంతో జోరు మీదున్న కల్యాణ్ రామ్, సరికొత్త వేషధారణలో బాక్సాఫీస్ ను బద్దలుకొట్టేందుకు రెఢీ అవుతున్నట్లు తెలుస్తోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 డెవిల్‌ గ్లింప్స్ వీడియో గురించిన ట్వీట్