Page Loader
నందమూరి తారకరత్న బర్త్ డే: మరణించిన నాలుగు రోజులకే పుట్టుక
నందమూరి తారకరత్న బర్త్ డే స్పెషల్

నందమూరి తారకరత్న బర్త్ డే: మరణించిన నాలుగు రోజులకే పుట్టుక

వ్రాసిన వారు Sriram Pranateja
Feb 22, 2023
07:00 am

ఈ వార్తాకథనం ఏంటి

నందమూరి తారకరత్న మరణం సినిమా అభిమానుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. యువగళం పాదయాత్రలో అస్వస్థతకు గురై, ఆ తర్వాత 20రోజులకు పైగా మృత్యువుతో పోరాడి చివరకు మృత్యువు చేతిలో ఓడిపోయారు తారకరత్న. 39ఏళ్ళ వయసులో మహాశివరాత్రి రోజున శివైక్యం అయ్యారు తారకరత్న. ఆయన స్వర్గస్తులైన నాలుగు రోజుల తర్వాత ఆయన పుట్టినరోజు వచ్చింది. ఫిబ్రవరి 22వ తేదీన తారకరత్న జన్మదినం. 1983 ఫిబ్రవరి 22వ తేదీన నందమూరి మోహనకృష్ణ దంపతులకు తారకరత్న జన్మించారు. 2002లో ఒకటో నంబర్ కుర్రాడు సినిమాతో చిత్రపరిశ్రమలోకి అడుగు పెట్టారు. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా, మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత యువరత్న(2003), తారక్(2003), భద్రాద్రి రాముడు(2004) సినిమాలు వచ్చాయి.

తారకరత్న

9సినిమాలను ఒకేసారి మొదలెట్టి రికార్డు సృష్టించిన తారకరత్న

హీరోగా చేసిన చిత్రాలేమీ సక్సెస్ కాకపోవడంతో ఆ తర్వాత కొన్నిరోజుల పాటు సినిమాల వైపు వెళ్ళలేదు తారకరత్న. ఆ తర్వాత 2009లో వచ్చిన అమరావతి సినిమాలో విలన్ గా తారకరత్న కనిపించాడు. ఆ సినిమాకు నంది అవార్డు అందుకున్నాడు తారకరత్న. అదలా ఉంచితే, తారకరత్న పేరు మీద 9సినిమాల రికార్డు ఉంది. హీరోగా ఎంట్రీ ఇవ్వాలనుకున్నప్పుడే ఏకంగా 9సినిమాలను మొదలెట్టాడు తారకరత్న. ఒకేరోజున 9సినిమాలను మొదలెట్టాడు. ఆ సినిమాలు మొదలయ్యాయి కూడా. హీరోగా ఎంట్రీ ఇవ్వకముందే 9సినిమాలను మొదలెట్టడమనేది ఇప్పటికీ రికార్డుగా ఉంది. ఎప్పటికీ ఉంటుంది. ఇక తారకరత్న వ్యక్తిగత జీవితానికి వస్తే, అలేఖ్య రెడ్డి ని 2012లో వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.