Page Loader
Nani31: నాని 'సరిపోదా శనివారం' మూవీ గింప్స్ వచ్చేసింది (వీడియో)

Nani31: నాని 'సరిపోదా శనివారం' మూవీ గింప్స్ వచ్చేసింది (వీడియో)

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 23, 2023
01:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

నాచురల్ స్టార్ నాని ఎప్పటికప్పుడు కొత్త కొత్త కథలతో ప్రేక్షకులని మెప్పించడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇటీవల యాక్షన్ ఫిలిం దసరా సినిమాతో నాని భారీ హిట్ కొట్టాడు. త్వరలోనే నాని 30వ సినిమా హాయ్ నాన్న అనే సినిమాతో రాబోతున్నాడు. ఇక ఈ సినిమా చేస్తుండగానే వివేక అత్రేయతో మరో సినిమాను నాని అఫిషియల్‌గా అనౌన్స్ చేశాడు. నాని, వివేక ఆత్రేయ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాకు 'సరిపోదా శనివారం' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. దసరా సందర్భంగా ఈ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. సాయికుమార్ వాయిస్‌తో ఈ వీడియో ఇంట్రెస్టింగ్‌గా సాగింది. సరిపోదా ఆయుధ పూజతో ఆరంభం అంటూ నాని ట్వీట్ చేశాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 నాని చేసిన ట్వీట్