
The paradise: 'ది ప్యారడైజ్'.. నానికి భిన్నమైన పేరు,కొత్త లుక్
ఈ వార్తాకథనం ఏంటి
'దసరా' విజయానంతరం హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈసారి 'ద ప్యారడైజ్' (The Paradise) అనే విభిన్న కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తూ,ఇందులో నాని పాత్ర పేరును ప్రకటించారు. ఈ పోస్టర్‌లో నాని పూర్తిగా డిఫరెంట్‌గా కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు. సినిమాలో ఆయన 'జడల్' అనే పాత్రలో కనిపించనున్నారని వెల్లడించారు.మేకర్స్ పోస్టర్‌పై "ఇది ఒక అల్లికగా ప్రారంభమై... విప్లవంగా ముగిసింది" అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ చిత్రం వచ్చే సంవత్సరం మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీతో పాటు మొత్తం ఎనిమిది భాషల్లో విడుదల కానుంది.
వివరాలు
తిరుగుబాటు, నాయకత్వం, తల్లీకొడుకుల అనుబంధం ప్రధానాంశాలుగా..
ఇంతకుముందు దర్శకుడు, సినిమాలో నాని లుక్ వెనక ఉన్న ఆసక్తికర విషయాన్ని వెల్లడించిన విషయం తెలిసిందే. "నాని జడల వెనక నా వ్యక్తిగత జీవితంలోని ఓ భావోద్వేగం దాగి ఉంది. నా చిన్ననాటి రోజుల్లో మా అమ్మ నాకు అలా జడలు వేసేది. ఐదో తరగతి వరకు జుట్టు అల్లిపెట్టుకుని నేనే స్కూల్ వెళ్లేవాడిని. ఈ లుక్ సినిమా కథకు ఎలా కనెక్ట్ అవుతుందో మాత్రం ఇప్పుడే చెప్పలేను" అని తెలిపారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలను పరిశీలిస్తే, ఈ కథలో తిరుగుబాటు, నాయకత్వం, తల్లీకొడుకుల అనుబంధం ప్రధానాంశాలుగా ఉండనున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్
Crack all the details you can 😎@odela_srikanth & @kabilanchelliah went god mode for our 'JADAL' @NameisNani 🔥🔥#TheParadise pic.twitter.com/0Br9DRXZaD
— THE PARADISE (@TheParadiseOffl) August 8, 2025