
Nani: మిషిన్ గన్ తో, వీరుడిలా.. నాని లుక్ అదుర్స్
ఈ వార్తాకథనం ఏంటి
నేచురల్ స్టార్ నాని సినిమాలకు ప్రేక్షకులలో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఆయన నటించిన ప్రతి సినిమాకు మంచి స్పందన లభిస్తూనే ఉంటుంది. ఇక ఇటీవల ఆయన తన పంథాను మార్చి, ఆసక్తికరమైన కథాంశాలపై దృష్టి సారిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
తాజాగా, 'దసరా' ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని 'ది ప్యారడైజ్' అనే సినిమా చేస్తున్నారు.
మ్యాడ్ మ్యాక్స్ స్టైల్ షేడ్స్‌తో మిళితమైన మాస్ యాక్షన్ డ్రామాగా, ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు.
ఇటీవల, ఈ సినిమా నుంచి 'రా స్టేట్‌మెంట్' పేరుతో ఓ వీడియో విడుదల కాగా, అందులో వినిపించిన డైలాగ్‌లు, నాని లుక్, గెటప్ అన్నీ ఊరమాస్ వాతావరణాన్ని తెచ్చాయి.
వివరాలు
రెండు జడలతో రా అండ్ రస్టిక్ లుక్‌లో..
నాని గెటప్ మాత్రం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది.రెండు జడలతో రా అండ్ రస్టిక్ లుక్‌లో కనబడుతూ,సినిమాపై అంచనాలను పెంచేశాడు.
తాజాగా విడుదలైన నాని లుక్ పోస్టర్ ఆసక్తిని రెట్టింపు చేసింది.మిషిన్ గన్ పట్టుకొని, వీరుడిలా వర్షాన్ని తట్టుకుని నిలబడి ఉన్న నాని స్టిల్ చూస్తుంటే, ఈ సినిమా వెండితెరపై హైవోల్టేజ్ మాస్ యాక్షన్‌ను అందించబోతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
1980ల కాలాన్ని ఆధారంగా తీసుకున్న ఈ సినిమా,మ్యాడ్ మ్యాక్స్ శైలిలో తెరకెక్కనుంది.
ఈ ప్రాజెక్ట్‌కు సుమారు రూ.110-120కోట్ల మధ్య బడ్జెట్ ఉండే అవకాశం ఉంది.
2026మార్చి 26న ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
అయితే,అదే సమయంలో రామ్ చరణ్-బుచిబాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా కూడా విడుదల కానుందనే టాక్ వినిపిస్తోంది.
వివరాలు
తాజా పోస్టర్‌లో విడుదల తేదీ..
ఇక ఆ వారం ముందు రణ్‌బీర్ కపూర్ 'లవ్ అండ్ వార్', యశ్ 'టాక్సిక్' వంటి భారీ చిత్రాలు విడుదల కావడంతో,నాని సినిమా విడుదల తేదీ మార్చే అవకాశం ఉందా? అనే చర్చ కూడా జరుగుతోంది.
అయితే, తాజా పోస్టర్‌లో 26.3.26 అనే విడుదల తేదీని స్పష్టంగా ప్రదర్శించారు.ఇంకా 365 రోజులు మాత్రమే ఉన్నాయని పేర్కొంటూ,నాని తన కొత్త పోస్టర్ ద్వారా అభిమానులకు పూర్తి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
ఈ పోస్టర్ చూసిన తర్వాత,నాని లుక్‌కు నెటిజన్లు మంత్రముగ్ధులైపోతున్నారు.తిరుగుబాటు, నాయకత్వం,తల్లీకొడుకుల అనుబంధం నేపథ్యంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం,నాని కెరీర్‌లో అత్యుత్తమ సినిమాగా నిలిచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న నాని కొత్త పోస్టర్ ఇదే..
New Poster: #TheParadise (#Nani)https://t.co/zNXfe9IN2W#OdelaSrikanth #123telugu pic.twitter.com/HzAM6qzGPv
— 123telugu (@123telugu) March 26, 2025