Page Loader
Nani With Balagam Venu : బలగం డైరెక్టర్ వేణుతో నాని కొత్త సినిమా.. స్టోరీ ఏంటంటే
బలగం వేణుతో నాని కొత్త సినిమా..ఎలా అంటే

Nani With Balagam Venu : బలగం డైరెక్టర్ వేణుతో నాని కొత్త సినిమా.. స్టోరీ ఏంటంటే

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Dec 05, 2023
05:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ చిత్రపరిశ్రమలో చిన్న సినిమాగా విడుదలైన బలగం ఎంత పెద్ద సూపర్ డూపర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఆ సినిమా డైరెక్టర్ బలగం వేణుతో నేచురల్ స్టార్ నాని సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. దసరాతో శ్రీకాంత్ ఓదెలను దర్శకుడిగా పరిచయం చేసిన నాని, తాజాగా హాయ్ నాన్నతో శౌర్యువ్‌ను కొత్త డైరెక్టర్‌గా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అయితే హాయ్ నాన్న ప్రమోషన్స్'లో భాగంగా ట్విట్టర్ ద్వారా నిర్వహించిన #AskNani కార్యక్రమంలో ఫ్యాన్స్,నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు నాని సమాధానాలిచ్చాడు. హాయ్ నాన్నతో శౌర్యువ్'ను కొత్త దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. కొత్త డైరెక్టర్లలో ఎవరితో పనిచేయాలని మీరు కోరుకుంటున్నారని ఓ నెటిజన్ అడిగారు. బదులుగా "బలగం డైరెక్టర్ వేణు" అని నాని చెప్పడం గమనార్హం.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

#Ask Nani కార్యక్రమం నిర్వహించిన హాయ్ నాన్న హీరో