Page Loader
Narne Nithin : నార్నే నితిన్ సోలో హీరోగా 'శ్రీ శ్రీ శ్రీ రాజవారు' ట్రైలర్ విడుదల
నార్నే నితిన్ సోలో హీరోగా 'శ్రీ శ్రీ శ్రీ రాజవారు' ట్రైలర్ విడుదల

Narne Nithin : నార్నే నితిన్ సోలో హీరోగా 'శ్రీ శ్రీ శ్రీ రాజవారు' ట్రైలర్ విడుదల

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 01, 2025
12:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌ యంగ్ టైగర్‌ జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 'మ్యాడ్', 'మ్యాడ్ 2', 'అయ్' వంటి చిత్రాల ద్వారా యువతలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నితిన్, ఇప్పటివరకు మల్టీస్టారర్‌ చిత్రాల్లోనే కనిపించాడు. అయితే ఇప్పుడు ఆయన పూర్తిగా సోలో హీరోగా కనిపించనున్న తొలి చిత్రం 'శ్రీ శ్రీ శ్రీ రాజవారు'. ఈ సినిమాతో నార్నే నితిన్ హీరోగా తన పూర్తి స్థాయి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సతీష్ వేగేశ్న దర్శకత్వం వహిస్తుండగా, శ్రీ వేదాక్షర మూవీస్ పతాకంపై చింతపల్లి రామారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ జూన్ 6న థియేటర్లలో విడుదల కానుంది.

Details

జూన్ 6న విడుదలయ్యే అవకాశం

విడుదల తేదీ సమీపిస్తున్న వేళ చిత్రయూనిట్ తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసింది. ట్రైలర్‌ విషయానికి వస్తే, సిగరెట్ అలవాటుతో ఉండే ఒక యువకుడి చుట్టూ కథ తిరుగుతుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కించినట్లు స్పష్టమవుతోంది. ఈ చిత్రంలో నార్నే నితిన్‌తో పాటు రావు రమేష్, నరేష్, రఘు కుంచె, ప్రవీణ్, రచ్చ రవి, సరియు, రమ్య, ప్రియ మచిరాజు, భద్రం, ఆనంద్, జబర్దస్త్ నాగి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సంగీతాన్ని కైలాష్ మీనన్ అందిస్తున్నారు. కథాంశం వైవిధ్యం, కాస్టింగ్ బలముతో 'శ్రీ శ్రీ శ్రీ రాజవారు' ఓ ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునే చిత్రంగా నిలుస్తుందా? అన్నది జూన్ 6న విడుదలయ్యే తర్వాత తెలియనుంది.