Page Loader
Narudi Brathuku Natana First Glimps: నరుడి బ్రతుకు నటన ఫస్ట్ గ్లింప్స్ విడుదల

Narudi Brathuku Natana First Glimps: నరుడి బ్రతుకు నటన ఫస్ట్ గ్లింప్స్ విడుదల

వ్రాసిన వారు Stalin
Apr 07, 2024
07:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

కంటెంట్ ఓరియంట్ సబ్జెక్టులతో వరుస చిత్రాలు చేస్తున్న పీపుల్స్ మీడియా సంస్థ తాజాగా నరుడి బ్రతుకు నటన చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఫస్ట్ గ్లింప్స్ ను ఆదివారం చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ ఫస్ట్ గ్లింప్స్ చూస్తుంటే హిట్ గ్యారంటీ అనిపిస్తోంది. కేరళ బ్యాక్ డ్రాప్లో రూపొందుతున్న ఈ చిత్రంలో కేరళ ప్రకృతి రమణీయతను తెరపై అద్భుతంగా ఒడిసిపట్టి చూపించినట్లే ఉంది. ఫస్ట్ గ్లింప్స్ లోనే ఇలా ఉంటే ఇక సినిమా ఎంత అద్భుతంగా ఉంటుందోనని ఆడియన్స్ అంచనాలు పెంచేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. చిత్ర యూనిట్ కూడా తొలి నుంచి కేరళ అందాలను అద్భుతంగా తెరకెక్కిస్తున్నామని చెబుతూనే ఉంది.

Kerala backdrop

ఈ నెల 26న విడుదలకు సన్నాహాలు

విడుదలకు ముందే దాదాపు అరవైకి పైగా అంతర్జాతీయ అవార్డులను దక్కించుకున్న ఈసినిమాను ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు నిర్మాతలు సన్నద్ధమయ్యారు. టీజీ విశ్వప్రసాద్, సుకుమార్ బొరెడ్డి, డాక్టర్ సింధూరెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి వివేక్ కూచిబొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఫస్ట్ లుక్ తో పాటు తాజాగా విడుదల చేసిన గ్లింప్స్ చూస్తుంటే ఇది మన జీవితాలను పట్టి చూపే కథగా అనిపిస్తోంది. స్నేహం, ప్రేమ, కామెడీ, బాధలు ఇలా అన్ని ఎమోషన్స్ను టచ్ చేసిన సినిమాగా కనిపిస్తోంది.