Jani Master: జానీ మాస్టర్‌కు ఎదురుదెబ్బ.. జాతీయ అవార్డు నిలిపివేత
ప్రసిద్ధ నృత్య దర్శకుడు షేక్ జానీ బాషా అలియాస్ జానీ మాస్టర్‌కు 2022 సంవత్సరానికి గానూ ప్రకటించిన జాతీయ ఉత్తమ నృత్య దర్శకుడి అవార్డును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ సెల్ శనివారం ప్రకటించింది. ఈ నెల 8న దిల్లీ విజ్ఞాన్‌భవన్‌లో అవార్డును అందుకోవాల్సి ఉన్న జానీపై ఇటీవలి ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెల్ పేర్కొంది. జానీమాస్టర్‌పై ఒక సహాయ నృత్యదర్శకురాలు ఇటీవల నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. జానీ మాస్టర్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపించింది.
జానీ మాస్టర కు మద్యంతర బెయిల్
ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేసి, జానీని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ అభియోగాల నేపథ్యంలో అవార్డు ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ సెల్ వెల్లడించింది. అవార్డుల ఆహ్వానపత్రికను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. జానీమాస్టర్‌కు పురస్కార కార్యక్రమంలో పాల్గొనడానికి న్యాయస్థానం ఈ నెల 6 నుంచి 9 వరకు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. కానీ కేసు విచారణ కొనసాగుతున్న క్రమంలో అవార్డు తాత్కాలికంగా నిలిపివేయడం చర్చనీయాంశంగా మారింది.