National Film Awards: నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ కేటగిరీల నుండి ఇందిరా గాంధీ, నర్గీస్ దత్ పేర్ల తొలగింపు
70వ జాతీయ చలనచిత్ర అవార్డులు 2022 రెగ్యులేషన్స్ మంగళవారం నాడు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ,దివంగత నటి నర్గీస్ దత్ పేర్లను రాబోయే అవార్డుల ప్రదానోత్సవంలో ఉపయోగించబోమని తెలియజేసింది. డెబ్యూ డైరెక్టర్ అవార్డులో ఇక పై ఇందిరా గాంధీ పేరు కనిపించదు.నర్గీస్ దత్ అవార్డు ఇకపై నేషనల్ ఇంటిగ్రేషన్ ఫిల్మ్ అవార్డుగా పరిగణిస్తారు. దర్శకుడు ప్రియదర్శన్‌తో కూడిన జాతీయ చలనచిత్ర అవార్డుల కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. జాతీయ చలనచిత్ర అవార్డుల్లో సకాలంలో సంస్కరణలు తీసుకురావడానికి సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి నీరజా శేఖర్ అధ్యక్షతన ప్రియదర్శన్‌తో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించింది.70వ జాతీయ చలనచిత్ర అవార్డుల నోటిఫికేషన్ విడుదలైనప్పుడు ఈ మార్పులు ప్రకటించారు.
సినిమా అవార్డుల మొత్తంలో మార్పులు
ఈసారి సినిమా అవార్డుల మొత్తంలో కూడా మార్పులు తీసుకొచ్చారు. ఇంతకుముందు, డెబ్యూ డైరెక్టర్‌కి అవార్డు మొత్తాన్ని దర్శకుడు, నిర్మాతకి పంచేవారు. ఇక నుంచి ఆ మొత్తాన్ని దర్శకుడికి మాత్రమే అందుతుంది. సినీ పరిశ్రమలో అత్యున్నత పురస్కారం బాబా సాహిబ్ ఫాల్కే అవార్డు ప్రైజ్ మనీని 10 లక్షల నుంచి 15 లక్షలకు పెంచారు. ఉత్తమ దర్శకుడు, చిత్రానికి ఇచ్చే స్వర్ణ కమలం అవార్డును అన్ని విభాగాల్లో రూ.3 లక్షలకు పెంచారు. రజతకమలం అవార్డులను కూడా రూ.2 లక్షలకు సవరించారు.