LOADING...
Chiranjeevi: తెలుగు చిత్రాలకు జాతీయ గౌరవం.. అవార్డు గ్రహీతలకు చిరంజీవి అభినందనలు!
తెలుగు చిత్రాలకు జాతీయ గౌరవం.. అవార్డు గ్రహీతలకు చిరంజీవి అభినందనలు!

Chiranjeevi: తెలుగు చిత్రాలకు జాతీయ గౌరవం.. అవార్డు గ్రహీతలకు చిరంజీవి అభినందనలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 02, 2025
01:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ సినీప్రపంచంలో అత్యున్నత గౌరవంగా పరిగణించే 71వ జాతీయ చలనచిత్ర అవార్డులు శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ అవార్డుల్లో తెలుగు చిత్రాలు అనేక విభాగాల్లో మైలురాళ్లను సాధించాయి. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ నటించిన 'భగవంత్ కేసరి' ఉత్తమ తెలుగు ప్రాంతీయ చిత్రంగా ఎంపిక కావడం చిత్రబృందానికి గొప్ప గౌరవంగా మారింది. దీనిపై సినీ ప్రముఖులు స్పందిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేస్తూ స్పందించారు. ఈసారి పదికి పైగా విభాగాల్లో తెలుగు సినిమాలు జాతీయ అవార్డులు సాధించడం చూసి ఎంతో గర్వంగా ఉంది. విజేతలందరికీ హృదయపూర్వక అభినందనలంటూ మెగా హీరో పోస్ట్‌ చేశారు.

Details

ప్రధాన అవార్డులు

ఉత్తమ చిత్రం: 12వ ఫెయిల్ (నిర్మాత, దర్శకుడు: విధు వినోద్ చోప్రా) ఉత్తమ నటుడు: విక్రాంత్ మాస్సే (12వ ఫెయిల్), షారూఖ్ ఖాన్ (జవాన్) ఉత్తమ నటీమణి: రాణి ముఖర్జీ (మీసిస్ చాటర్జీ వర్సెస్ నార్వే) ఉత్తమ దర్శకుడు: సుదీప్తో సేన్ (ది కేరళ స్టోరీ)

Details

తెలుగు చిత్రాలకు లభించిన ముఖ్య అవార్డులివే

ఉత్తమ తెలుగు చిత్రం: భగవంత్ కేసరి (నటుడు: బాలకృష్ణ, దర్శకుడు: అనిల్ రావిపూడి) ఉత్తమ AVGC చిత్రం: హనుమాన్ ఉత్తమ స్క్రీన్‌ప్లే: సాయి రాజేష్ (బేబీ) ఉత్తమ బాలనటి: సుకృతి బండిరెడ్డి (గాంధీ తాత చెట్టు) ఉత్తమ యాక్షన్ దర్శకత్వం: నందు - పృథ్వీ (హనుమాన్) ఉత్తమ గీత రచయిత: కాసర్ల శ్యామ్ - "ఊరు పల్లెటూరు" పాటకు (బలం)

Details

ఇతర విభాగాల్లో గెలిచిన చిత్రాలు

ఉత్తమ బాలల చిత్రం: నాల్ (మరాఠీ) ఉత్తమ ప్రజాదరణ చిత్రంగా: రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ ఉత్తమ సినిమాటోగ్రఫీ: లిటిల్ వింగ్స్ (తమిళ్) ఉత్తమ ఎడిటింగ్: మూవింగ్ ఫోకస్ (ఇంగ్లీష్) ఉత్తమ సౌండ్ డిజైన్: దుందగిరి కే ఫూల్ (హిందీ) ఉత్తమ బయోగ్రాఫికల్ ఫిల్మ్: మా బావు, మా గావ్ (ఒడిశా) ఈసారి తెలుగు సినిమాలు నాణ్యత, సాంకేతికత, భావోద్వేగాల పరంగా తిరుగులేని విజయాన్ని నమోదు చేశాయి. జాతీయ స్థాయిలో తెలుగు చిత్ర పరిశ్రమ తన ప్రత్యేకతను చాటిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.