తదుపరి వార్తా కథనం

బిజినెస్ లోకి దిగిన నయనతార దంపతులు: ఇంతకీ దేంట్లో పెట్టుబడులు పెడుతున్నారంటే?
వ్రాసిన వారు
Sriram Pranateja
Sep 14, 2023
05:10 pm
ఈ వార్తాకథనం ఏంటి
సినిమా సెలబ్రిటీలు అటు సినిమాలు చేసుకుంటూనే వ్యాపార రంగంలోనూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు.
ఆ జాబితాలో చాలామంది ఉన్నారు. తాజాగా నయనతార దంపతులు కూడా ఆ లిస్టులో చేరిపోయారు.
నయనతార, తన భర్త విఘ్నేష్ శివన్ తో కలిసి స్కిన్ కేర్ ప్రొడక్టులకు సంబంధించిన వ్యాపారాన్ని మొదలుపెట్టారు. ఈ మేరకు అధికారికంగా అప్డేట్ అందించారు.
www.9skin.in సైట్ లో స్కిన్ కేర్ సంబంధిత ప్రొడక్టులను అమ్మకానికి ఉంచనున్నారు. అంటే ఆన్ లైన్లో చర్మ సంబంధిత ప్రోడక్టులను అందుబాటులోకి తీసుకురానున్నారు.
చర్మ సంబంధిత ఉత్పత్తులకు సంబంధించిన ఈ సైట్ సెప్టెంబర్ 29వ తేదీ నుండి అందుబాటులోకి వస్తుందని తెలియజేశారు.
అదలా ఉంచితే, తాజాగా నయనతార నటించిన జవాన్ సినిమా మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది.