Nayanthara: 'మై ఎవ్రీథింగ్' అంటూ విఘ్నేశ్‌కి బర్తడే విషెష్ తెలిపిన నయనతార
నటుడు విఘ్నేశ్ శివన్ పుట్టినరోజు సందర్భంగా, నటి నయనతార సోషల్ మీడియాలో కొన్ని ప్రత్యేకమైన ఫొటోలను షేర్ చేస్తూ తన ప్రేమను వ్యక్తం చేశారు. ఈ ఫోటోల్లో నయనతార, విఘ్నేశ్‌ను ముద్దు పెడుతూ కనిపించింది. హ్యాపీ బర్త్‌డే మై ఎవ్రీథింగ్. నా ప్రేమను వ్యక్తం చేయడానికి మాటలు చాలవు. నీ కలలు నెరవేరాలని దేవుని ప్రార్థిస్తున్నానని అంటూ నయనతార పోస్టు చేశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో నెటిజన్లు ఈ క్యూట్ కపుల్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. నయనతార, విఘ్నేశ్ శివన్ ఇద్దరూ తొలిసారిగా "నేనూ రౌడీనే" చిత్రంలో కలిసి పనిచేశారు. ఆ సమయంలోనే వీరి స్నేహం ప్రేమగా మారింది.
వరుస సినిమాలతో బిజీగా ఉన్న నయనతార
సుమారు ఏడేళ్ల ప్రేమ తర్వాత, 2022లో ఈ జంట పెద్దల సమ్మతితో వివాహం చేసుకున్నారు. సరోగసి ద్వారా ఇద్దరు మగ పిల్లలకు తల్లిదండ్రులు అయ్యారు. ప్రస్తుతం కెరీర్ పరంగా చూస్తే, విఘ్నేశ్ శివన్ "లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ" అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. నయనతార ఇటీవల 'అన్నపూరణి' సినిమాలో నటనకు గాను సైమా అవార్డు గెలుచుకున్నారు. ప్రస్తుతం ఆమె 'టెస్ట్', 'డియర్ స్టూడెంట్స్', 'తన్ని ఒరువన్ 2' చిత్రాలతో బిజీగా ఉన్నారు.