Page Loader
SIIMA 2024: సైమా 2024 అవార్డుల వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా ఆరాధ్య బచ్చన్‌,నయనతార జంట
సైమా 2024 అవార్డుల వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా ఆరాధ్య బచ్చన్‌

SIIMA 2024: సైమా 2024 అవార్డుల వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా ఆరాధ్య బచ్చన్‌,నయనతార జంట

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 16, 2024
12:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా) 2024 వేడుక దుబాయ్‌ వేదికగా అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పలు సినీతారలు పాల్గొని సందడి చేశారు. తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమల ప్రముఖ నటీనటులు ఈ వేడుకకు హాజరై అవార్డులు గెలుచుకుని తమ సత్తా చాటారు. ఈ వేడుకలో జరిగిన మూమెంట్స్ నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి.

వివరాలు 

ఫొటోగ్రాఫర్‌గా ఆరాధ్య బచ్చన్ 

సైమా అవార్డుల్లో ఐశ్వర్యారాయ్‌ (Aishwarya Rai) తన కుమార్తె ఆరాధ్య బచ్చన్‌తో కలిసి పాల్గొన్నారు. అందరి దృష్టి ఆరాధ్య వైపే ఉన్నాయి. ఈ వేడుకలో ఆమె తీసిన కొన్ని ఫొటోలు వైరల్‌ అయ్యాయి. ప్రత్యేకంగా, ఐశ్వర్య అవార్డు తీసుకుంటున్న సమయంలో ఆరాధ్య ఫొటో తీసే క్షణం అందరిని ఆకట్టుకుంది. 'పొన్నియిన్‌ సెల్వన్‌-2' చిత్రానికి క్రిటిక్స్‌ ఛాయిస్‌ అవార్డులో ఐశ్వర్య ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్నారు. ఆమె అవార్డు స్వీకరించే క్షణాలను ఆరాధ్య తన ఫోన్‌లో బంధించారు.

వివరాలు 

నయనతార జంట రొమాంటిక్‌ మూమెంట్‌ 

ఇండస్ట్రీలో క్యూట్ కపుల్స్ లో ఒక్కరైనా నయనతార - విఘ్నేశ్‌ శివన్‌ జంట ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 'అన్నపూరణి' సినిమాకుగాను నయనతార (Nayanthara) ఉత్తమ నటి అవార్డును పొందారు. ఆమె అవార్డు స్వీకరించిన తర్వాత, విఘ్నేశ్‌ వేదికపైకి వచ్చి ఆమెకు ముద్దు పెట్టి అభినందించారు. దీనితో నయనతార ఆనందం, భావోద్వేగానికి గురయ్యారు. ఈ వేడుకకు హాజరైన నటి సరితను నయనతార ఆప్యాయంగా పలకరించిన దృశ్యాలు కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

వివరాలు 

వేడుకగా సైమా 2024 

సెప్టెంబరు 14, 15 తేదీలలో నిర్వహించిన ఈ వేడుకలో దక్షిణాది భాషల నటీనటులు హాజరై తమ ప్రదర్శనతో సందడి చేశారు. మొదటి రోజున తెలుగు,కన్నడ భాషల తారలు సందడి చెయ్యగా, రెండోరోజున తమిళ, మలయాళ సినీనటులు ఈ వేడుకకు హాజరై అవార్డులు అందుకున్నారు. తమిళంలో ఉత్తమ నటుడిగా విక్రమ్‌, మలయాళంలో టొవినో థామస్‌ అవార్డులు గెలుచుకున్నారు.