Hi Movie Review Telugu : హాయ్.. 'టాక్సిక్'కు పూర్తి భిన్నమైన పాత్రలో నయనతార.. మూవీ ఎలా ఉందంటే?
ఈ వార్తాకథనం ఏంటి
పెళ్లి, పిల్లల తర్వాత నయనతార (Nayanthara) తన పాత్రల ఎంపికలో మరింత ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఓ వైపు స్టార్ హీరోల సరసన నటిస్తూనే.. మరోవైపు తానే లీడ్ రోల్‌లో కనిపిస్తూ కథాబలమున్న సినిమాలను ఎంచుకుంటున్నారు. ఈ వారంలోనే 'టాక్సిక్'లో గంగగా కనిపించిన ఆమె.. తాజాగా 'హాయ్' అంటూ ఓ ఫ్యామిలీ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి కవిన్‌తో కలిసి ఆమె నటించిన ఈ చిత్రం ఎలా ఉంది? ఎలాంటి వినోదాన్ని పంచింది?
వివరాలు
కథేంటంటే..
రాజమహేంద్రవరానికి చెందిన సుబ్రహ్మణ్యం (కవిన్)కు పెళ్లీడు వచ్చినా.. ఇంకా తల్లిదండ్రుల చాటు బిడ్డగానే ఉంటాడు. ఇంట్లో చెప్పకుండా ఏ పని చేయడు.
మేనమామ కూతురంటే అతడికి ఎంతో ఇష్టం. ఆమెకు తన ప్రేమను వ్యక్తం చేస్తే.. 'మరీ నీ అంత మంచివాడు నాకు అక్కర్లేదు' అంటూ తిరస్కరిస్తుంది.
దీంతో సుబ్రహ్మణ్యం లెటర్ రాసి హైదరాబాద్ వెళ్లిపోతాడు. మరోవైపు భీమవరానికి చెందిన దేవసేన (నయనతార)ను తల్లి చిన్నప్పుడే వదిలి వెళ్లిపోవడంతో.. తండ్రి (ప్రభు) ఆమెను పెంచి పెద్ద చేస్తాడు.
అయితే తనకున్న తాగుడు అలవాటు కారణంగా.. ఊళ్లోని ఆసామి కొడుకుకు తన కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తానని మాట ఇస్తాడు.
కానీ పెళ్లిరోజే దేవసేన ఇంటి నుంచి తప్పించుకుని హైదరాబాద్ వెళ్లిపోతుంది.
వివరాలు
ఎలా ఉందంటే..
అనుకోని పరిస్థితుల్లో సుబ్రహ్మణ్యం, దేవసేన ఒకే చోట ఉండాల్సి వస్తుంది.
మరి వీరిద్దరూ కలిసిన తర్వాత ఏం జరిగింది? వారి ప్రయాణం ఎటువైపు సాగింది? ఇద్దరి కుటుంబాలు వీరిని కనిపెట్టాయా? దేవసేన గర్భవతి అని సుబ్రహ్మణ్యం తన కుటుంబానికి ఎందుకు అబద్ధం చెప్పాల్సి వచ్చింది?
వీరి మధ్య ప్రేమ ఎలా చిగురించింది? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ప్రేమ, పెళ్లి వద్దనుకుని ఇంటి నుంచి పారిపోయిన అబ్బాయి, అమ్మాయి అనుకోకుండా ఒకచోట కలవడం.. ఆ తర్వాత విధివారిని ఒక్కటిగా చేయడం.. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎన్నో ప్రేమకథలు తెరకెక్కాయి.
'హాయ్' కూడా అలాంటి రొటీన్ లవ్ డ్రామానే. దర్శకుడు విష్ణు ఈ కథను కొత్తగా కాకుండా సింపుల్‌గా చెప్పే ప్రయత్నం చేశారు.