Page Loader
Nayanthara : భర్త విఘ్నేష్ డైరెక్షన్'లో నయనతార కొత్త సినిమా.. హీరో, హీరోయిన్లు ఎవరంటే
Nayanthara : భర్త విఘ్నేష్ డైరెక్షన్'లో నయనతార కొత్త సినిమా.. హీరో అతనే

Nayanthara : భర్త విఘ్నేష్ డైరెక్షన్'లో నయనతార కొత్త సినిమా.. హీరో, హీరోయిన్లు ఎవరంటే

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Dec 06, 2023
04:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయనతార మరో కొత్త సినిమాని ఖరారు చేసినట్లు సమాచారం. ఈ మేరకు తన భర్త విఘ్నేష్ దర్శకత్వంలో ఈ చిత్రం పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో న‌య‌న‌తార ఓ యంగ్​ హీరోకు అక్కగా నటించనున్నారని తెలుస్తోంది. త‌న భర్త విఘ్నేశ్​ శివన్​ డైరెక్షన్​లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో న‌య‌న్ సిస్ట‌ర్ రోల్ చేయ‌నున్నారు. లవ్ టుడే సినిమాతో గుర్తింపు సాధించిన​ డైరెక్టర్, హీరో ప్రదీప్ రంగనాథన్‌తో విఘ్నేశ్​ ఈ సినిమా చేయ‌నున్నారట. ప్రదీప్‌కు అక్క‌గా నయనతార న‌టించ‌నున్న‌ట్లు తెలుస్తుంది.హీరోయిన్'గా జన్వా కపూర్ నటించనున్నారని టాక్. నయనతార-విఘ్నేష్ కాంబోలో ఇది మూడో సినిమాగా నిలుస్తుంది.భర్త​ డైరెక్షన్​లో నానుమ్ రౌడిధాన్, కత్తువాకుల రెండు కాదల్'లో ఆమె న‌టించారు.

DETAILS

అన్నపూరణితో హిట్ కొట్టిన సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార

మరోవైపు నయ‌నతార కెరీర్‌లో 75వ సినిమాగా రిలీజ్ అయిన అన్నపూరణికి నీలేష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. త్వరలోనే ఈ మూవీ ఓటిటిలోనూ రిలీజ్ కానున్నట్లు సమాచారం. దక్షిణాది సినీ పరిశ్రమల్లో ప్రస్తుతం నయనతార మంచి జోరుమీద ఉంది. వరుస సినిమాలతో బిజీ బిజీగా దూసుకెళ్తున్నారు. నాలుగు పదుల వయస్సులోనూ చేతినిండా సినిమాలతో లేడీ సూపర్ స్టార్ ఇమేజ్'తో కొనసాగుతున్నారు. దక్షిణాదితో పాటు హిందీలోనూ ఈ మళయాళ బ్యూటీ నటించింది.ఇటీవలే షారుక్ ఖాన్ జోడీగా నయయనతార నటించిన జవాన్ బ్లాక్ బస్టర్ అయ్యింది. తాజాగా అన్నపూరణి సినిమాతో మ‌రో హిట్'ను తన ఖాతాలో జమచేసుకుంది. మరోవైపు కమల్ హాసన్, మణిరత్నం కాంబోలో వ‌స్తున్న డ్రీమ్ ప్రాజెక్ట్‌లో న‌టిస్తుంది న‌య‌న‌తార.