
Nayanthara : విడాకుల పుకార్లపై స్పందించిన నయనతార.. ఒక్క ఫోటోతో తేల్చేసిందిగా!
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ హీరోయిన్ నయనతార జీవితం సినిమాల కన్నా ఎక్కువగా వ్యక్తిగత కారణాలతో హెడ్లైన్‌లో నిలుస్తూనే ఉంది. గతంలో ఎంతోమందితో రిలేషన్‌లో ఉన్న తర్వాత, చివరకు దర్శకుడు విగ్నేష్ శివన్‌తో ప్రేమలో పడిన నయనతార, ఆయన్నే పెళ్లి చేసుకోవడం తెలిసిందే. వీరిద్దరూ సరోగసీ ద్వారా ఇద్దరు కవలలకు తల్లిదండ్రులు కూడా అయ్యారు. అయితే ఇటీవల, నయనతార తన సోషల్ మీడియాలో ఓ పస్ట్ పెట్టింది. అది విడాకులపై హింట్ ఇస్తోందంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. నయనతారకీ, విగ్నేష్ శివన్‌కీ సంబంధాలు బాగోలేవు.. ఇద్దరూ విడిపోతున్నారనే వార్తలు విస్తృతంగా చక్కర్లు కొట్టాయి. నయనతార తన ఇన్‌స్టా స్టోరిలో పెట్టిన ఆ పోస్ట్ కారణంగా, ఈ గాసిప్స్‌కి మరింత ఊపొచ్చింది.
Details
అసత్య ప్రచారాలను నమ్మొద్దు
ఈ పుకార్లపై ఇంతవరకు నయనతార, ఆమె టీమ్, లేదా విగ్నేష్ శివన్ ఎవరూ స్పందించకపోవడం గమనార్హం. కానీ తాజాగా నయనతార ఓ ఫోటో షేర్ చేస్తూ పరోక్షంగా ఈ వార్తలపై స్పందించింది. ఆ ఫోటోలో విగ్నేష్ శివన్ నేలపై పడుకుని ఉంటే, నయనతార ఆయనపై కూర్చుంది. ఆ ఫోటోకు ఆమె జతచేసిన క్యాప్షన్ ఇలా పేర్కొంది. మా గురించి కొన్ని పనికిమాలిన వార్తలు చూస్తున్నప్పుడు మా రియాక్షన్ ఇలానే ఉంటుందంటూ ఆమె స్పష్టతనిచ్చారు. ప్రస్తుతం నయనతార, మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తోంది.