NBK 108 : బాలయ్య బాబు కొత్త లుక్ అదిరిపోయింది
ఈ వార్తాకథనం ఏంటి
నందమూరి బాలకృష్ణ వరుస హిట్‌లతో మంచి జోరు మీద ఉన్నాడు. ఇటీవల అన్ స్టాపబుల్ షో సూపర్ హిట్ అవ్వడం, సంక్రాంతికి వీరనరసింహరెడ్డితో మళ్లీ హిట్ కొట్టడం.. వరుసగా యాడ్స్ చేయడం.. ఇలా చెప్పుకుంటూ పోతే బాలయ్య బాబు ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఇదే ఊపుమీద NBK 108 కూడా మొదలుపెట్టారు.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న నందమూరి బాలకృష్ణ NBK 108 సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. ఉగాది కానుకగా సినిమాలోని ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
బాలయ్య ఫస్ట్ లుక్ ఫోటోలను అనిల్ రావిపూడి ట్విట్టర్ లో షేర్ చేస్తూ.. 'అన్న దిగిండు. ఈసారి మీ ఉహాకు మించి' అంటూ ట్వీట్ చేశాడు.
బాలకృష్ణ
బాలకృష్ణకు జోడిగా కాజల్ అగర్వాల్
ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. శ్రీలీల బాలయ్య కూతురి పాత్రలో నటిస్తోంది.
కామెడీ సినిమాలు తీసే అనిల్ రావిపూడి ఈసారి కామెడీ కాదంటూ బాలయ్యతో సినిమా తీస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ పోస్టర్‌లో బాలయ్య గంభీర్‌గా నిల్చుకొని మెలేసిన మీసంతో మెడలో కండువా చుట్టుకొని ఉన్నాడు. ఇంకో పోస్టర్ లో బాలయ్య పవర్ ఫుల్ గా చూస్తున్నట్టు ఉంది.
ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఇంకా స్పష్టత రాలేదు. ఇక బాలయ్య ఈ సినిమాతో హిట్ కొట్టి హ్యాట్రిక్ విజయాలను నమోదు చేయాలని బాలయ్య ఫాన్స్ తహతహలాడుతున్నారు.