ఎన్టీఆర్ 30 మూవీలో మరో బాలీవుడ్ యాక్టర్, విలన్ గా కన్ఫామ్
కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఇంకా పేరు పెట్టని, ఎన్టీఆర్ 30వ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంపికైన సంగతి తెలిసిండే. ఇప్పుడు మరోసారి మరో బాలీవుడ్ యాక్టర్ ని ఎన్టీఆర్ 30లోకి ఆహ్వానం పలుకుతున్నట్లు వినిపిస్తోంది. బాలీవుడ్ యాక్టర్ సైఫ్ ఆలీ ఖాన్, ఎన్టీఆర్ 30వ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడని, ఆల్ మోస్ట్ కన్ఫామ్ ఐపోయిందని, మరికొద్ది రోజుల్లో అధికారిక సమచారం వస్తుందని సోషల్ మీడియాలో చెబుతున్నారు. ఈ నెల చివర్లో షూటింగ్ మొదలు: ఎన్టీఆర్ 30 చిత్ర షూటింగ్, ఈ నెల చివర్లో మొదలు కానుందని ఆస్కార్ వేడుకల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. 24వ తేదీన పూజా కార్యక్రమాలు ఉండనున్నాయని అంటున్నారు.
ఎన్టీఆర్ 30 సినిమాలో విలన్ గా సైఫ్ ఆలీ ఖాన్?
ఆర్ఆర్ఆర్ స్థాయిలో ఎన్టీఆర్ 30
ఎన్టీఆర్ 30 మూవీ స్థాయి చాలా పెద్దగా ఉంటుందనీ, ఆర్ఆర్ఆర్ హైప్ ని ఎన్టీఆర్ 30 కూడా అందుకోవాలని కోరుకుంటున్నానని హాలీవుడ్ మీడియాతో ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ 30 సినిమా కథ, చాలా పెద్ద లెవెల్లో ఉంటుందనీ, గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఎమోషన్లు ఉండనున్నాయని దర్శకుడు కొరటాల శివ ఇంతకుముందే చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో అభిమానుల్లో ఆసక్తి బాగా పెరిగింది. ఎన్టీఆర్ 30పై అప్డేట్లు వరుసగా రావాలని వాళ్ళు ఆశిస్తున్నారు. అదలా ఉంచితే, ఆర్ఆర్ఆర్ ఆస్కార్ సంబరం తర్వాత ఎన్టీఆర్ మాట్లాడే మాటలు వినాలని అందరూ కోరుకుంటున్నారు. అందుకే ఈరోజు జరిగే దాస్ కా ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఎంతగానో ఎదురుచుస్తున్నారు.
ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి