తదుపరి వార్తా కథనం

Balakrishna : 'NBK 109' సినిమా టైటిల్, టీజర్ విడుదల తేదీ ఖరారు!
వ్రాసిన వారు
Jayachandra Akuri
Nov 12, 2024
06:54 pm
ఈ వార్తాకథనం ఏంటి
నందమూరి బాలకృష్ణ హీరోగా డైరక్టర్ బాబీ తెరకెక్కిస్తున్న 'NBK109' నుంచి కీలక అప్డేట్ వచ్చింది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై భారీ పీరియాడిక్ యాక్షన్ మూవీగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
ఈ సినిమా నుంచి ఇప్పటికే గ్లింప్స్ విడుదలయ్యాయి. అలాగే సంక్రాంతికి విడుదల అవుతుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. బాలయ్య అభిమానులు ఎప్పటినుంచో ఈ సినిమా టైటిల్ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజాగా NBK109 టైటిల్, టీజర్‌ను నవంబర్ 15, ఉదయం 10:24 నిమిషాలకు విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ టైటిల్, టీజర్ విడుదలపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
మీరు పూర్తి చేశారు