LOADING...
NBK 112 : తెరపైకి 'బాలయ్య-కొరటాల' సినిమా.. ముహూర్తం ఖరారు
తెరపైకి 'బాలయ్య-కొరటాల' సినిమా.. ముహూర్తం ఖరారు

NBK 112 : తెరపైకి 'బాలయ్య-కొరటాల' సినిమా.. ముహూర్తం ఖరారు

వ్రాసిన వారు Moogati Shabari
Apr 24, 2026
01:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

నందమూరి అభిమానుల్లో ఉత్సాహం రేపే ఒక ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. 'గాడ్ ఆఫ్ మాసెస్' నందమూరి బాలకృష్ణ, సక్సెస్‌ఫుల్ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో ఒక భారీ చిత్రం రూపుదిద్దుకోబోతోంది. ఈ ఇద్దరి కలయికలో సినిమా వస్తుందనే ప్రచారం గత కొంతకాలంగా జరుగుతుండగా, ఇప్పుడు ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ముహూర్తం ఫిక్స్ అయినట్లు సమాచారం. తాజా అప్‌డేట్ ప్రకారం, ఈ ప్రతిష్టాత్మక సినిమాను మే 1వ తేదీన పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభించనున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ తన 111వ చిత్రాన్ని దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ కొనసాగుతుండగానే, కొరటాల శివ ప్రాజెక్ట్‌ను కూడా లైన్‌లోకి తీసుకొచ్చారు బాలయ్య.

వివరాలు

జూన్ నెల నుంచి రెగ్యులర్ షూటింగ్

జూన్ నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశముందని తెలుస్తోంది. దర్శకుడు కొరటాల శివ తన చిత్రాల్లో బలమైన సందేశంతో పాటు హీరో పాత్రను శక్తివంతంగా చూపించే విధానానికి పేరుగాంచారు. ఇప్పుడు బాలయ్య ప్రత్యేకమైన యాక్షన్ స్టైల్‌కు కొరటాల శివ మేకింగ్ కలిస్తే, వెండితెరపై బాక్సాఫీస్ రికార్డులు బద్దలవడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

వివరాలు

త్వరలోనే అధికారిక ప్రకటన..

ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సినిమాను వేగంగా పూర్తి చేసి 2027 సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలని చిత్రబృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని సమాచారం. ఇక 'దేవర' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న కొరటాల శివ, ఎన్టీఆర్‌తో 'దేవర 2' ప్రారంభించడానికి ముందు ఈ గ్యాప్‌లో బాలకృష్ణ సినిమాను పూర్తి చేయనున్నారని తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Advertisement