
స్కంద: నీ చుట్టూ చుట్టూ సాంగ్ ప్రోమోలో శ్రీలీల అదిరిపోయే స్టెప్పులు
ఈ వార్తాకథనం ఏంటి
ది వారియర్ తర్వాత రామ్ పోతినేని హీరోగా వస్తున్న చిత్రం స్కంద. పాన్ ఇండియా రేంజ్ లో ఐదు భాషల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా నుండి నీ చుట్టూ చుట్టూ అనే పాట ప్రోమో రిలీజైంది.
క్యాచీ ట్యూన్ తో క్రేజీగా ఉన్న పాట ప్రోమోలో శ్రీలీల, రామ్ పోతినేని స్టెప్పులు వేయనున్నారు.
ఈ ప్రోమోలో గులాబీ, నీలం కలగలిసిన చమ్కీల స్కర్ట్ లో శ్రీలీల ధగధగ మెరిసిపోతోంది. తెలుపు రంగు చొక్కాలో రామ్ పోతినేని కూల్ గా ఉన్నాడు.
ఈ పాటలో శ్రీలీల స్టెప్పులు అదిరిపోనున్నాయని ప్రోమో చూస్తే అర్థమవుతోంది.
Details
సెప్టెంబర్ 15వ తేదీన థియేటర్లలో విడుదల
ప్రోమోలో ఒక్క తెలుగు పదం వినిపించలేదు. పూర్తి పాటను ఆగస్టు 3వ తేదీన ఉదయం 9:36నిమిషాలకు విడుదల చేస్తామని చిత్రబృందం వెల్లడి చేసింది.
ప్రోమోలో థమన్ సంగీతం బాగా వినిపించింది. పాట కూడా ఇదే స్టైల్ లో ఉంటుందని అనిపిస్తోంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మళయాలం భాషల్లో పాటను రిలీజ్ చేయనున్నరు.
రామ్ పోతినేని కెరీర్ లో మొదటి పాన్ ఇండియా సినిమా రూపొందుతున్న స్కంద సినిమాను బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్నారు.
శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమా, సెప్టెంబర్ 15వ తేదీన థియేటర్లలో విడుదల అవుతుంది.
స్కంద తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో డబుల్ ఇస్మార్ట్ సినిమాలో రామ్ పోతినేని నటిస్తున్నాడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పాట ప్రోమో రిలీజ్ పై నిర్మాణ సంస్థ ట్వీట్
Ustaad @ramsayz & @SreeLeela14 Killer Moves will set the dance floor on fire 🔥🕺💃
— Srinivasaa Silver Screen (@SS_Screens) August 1, 2023
Here's the Stylish Energetic promo of#NeeChuttuChuttu - https://t.co/5cOq3vE8RF#MainPeechePeeche - https://t.co/yoxcixMleZ#OnaSuthiSuthi - https://t.co/rxkBs334Sv#NinSutthaSuttha -… pic.twitter.com/vNhQXdHmFX