Page Loader
Srikanth Iyengar : క్షమాపణ కావాలా... ఇంకాస్త వేచి ఉండండి!
క్షమాపణ కావాలా... ఇంకాస్త వేచి ఉండండి!

Srikanth Iyengar : క్షమాపణ కావాలా... ఇంకాస్త వేచి ఉండండి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 28, 2024
09:23 am

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ శ్రీకాంత్ అయ్యంగార్ అలియాస్ శ్రీకాంత్ భరత్ తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. రీసెంట్‌గా వచ్చిన 'సరిపోదా శనివారం' చిత్రంలో, అలాగే ఇటీవల విడుదలైన 'పొట్టెల్'లో ఆయన నటన ప్రేక్షకులను మెప్పించింది. అయితే 'పొట్టెల్' సినిమా సక్సెస్ మీట్‌లో రివ్యూ రైటర్స్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో పెనుదుమారం రేపాయి. షార్ట్ ఫిల్మ్ తీయడం చేతకాని నా కొడుకులు కూడా రివ్యూలు రాస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇక శ్రీకాంత్ వ్యాఖ్యలపై ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ తమ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై 'మా' అధ్యక్షుడు మంచు విష్ణుకు కూడా ఫిర్యాదు చేసింది.

Details

త్వరలోనే అన్ని వివరాలను తెలియజేస్తా

జర్నలిస్టుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న ఈ వ్యాఖ్యలపై తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ అయ్యంగార్ తన వ్యాఖ్యలకు వివరణ ఇస్తూ తాజాగా వీడియో విడుదల చేశారు. వీడియోలో తన మాటల వల్ల కొందరికి బాధ కలిగించానని, త్వరలో అన్ని విషయాలను స్పష్టీకరిస్తూ బేషరతు క్షమాపణ చెబుతానని వెల్లడించారు. నెటిజన్లు ఈ వీడియోపై రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఇది క్షమాపణ చెబుతున్నట్లుగా కాకుండా మరో వివాదానికి కారణం అవుతున్నట్లుగా ఉందని కామెంట్లు చేస్తున్నారు.