Neha Shetty : OG సినిమాలో నేహా శెట్టి స్పెషల్ సాంగ్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి అదిరే ట్రీట్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రెండు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. వాటిలో ఒకటి హరహర వీరమళ్లు, ఇది ఏఎం రత్నం నిర్మిస్తున్న సినిమా, జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. మరొక చిత్రం 'OG' ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు 70శాతం పూర్తయింది. పవన్ కళ్యాణ్‌కు మిగిలిన షెడ్యూల్ కేవలం 10-15 రోజులే ఉంది. ఓజీ సినిమా షూటింగ్ ప్రస్తుతం థాయిలాండ్‌లో జరుగుతుంది. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందట, దీనికి నేహా శెట్టిని ఎంపిక చేశారు.
ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించిన నేహా శెట్టి
ఆమె డీజే టిల్లులో రాధికగా మెరిసినట్లు పాపులర్ అయింది. నేహా శెట్టి తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించింది. తన అందం, అభినయంతో స్పెషల్ సాంగ్ లో ఏ మేరకు రాణిస్తుందో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నేహా శెట్టికి ఇది గొప్ప అవకాశమనిని ఆమె అభిమానులు సోషల్ మీడియా ద్వారా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఓజీ సినిమా హై-ఎండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది.