LOADING...
Mohanlal's Neru: పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో మోహన్‌లాల్ 'నేరు' 
Mohanlal's Neru: పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో మోహన్‌లాల్ 'నేరు'

Mohanlal's Neru: పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో మోహన్‌లాల్ 'నేరు' 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 23, 2024
12:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

మోహన్‌లాల్ నటించిన 'నేరు' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాలో కంటెంట్, బావుండడంతో ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. థియేట్రికల్ రన్ ముగిసే సమయానికి, 'నేరు' 80 కోట్లకు పైగా గ్రాస్‌ను రాబట్టింది. Neru ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌(Disney plus hotstar)లో ప్రసారం అవుతోంది. ఒరిజినల్ మలయాళ వెర్షన్‌తో పాటు, తెలుగు, హిందీ, తమిళం,కన్నడ భాషల డబ్బింగ్ వెర్షన్‌లు కూడా స్ట్రీమింగ్ కోసం సిద్ధంగా ఉన్నాయి.

Details 

మోహన్‌లాల్, జీతూ జోసెఫ్‌ల కలయికలో ఇది నాల్గవ సినిమా

'నేరు' సినిమా థియేటర్లలో మిస్ అయిన వారందరు ఈ ఓటిటి ప్లాట్ఫారం లో చూడవచ్చు. ప్రముఖ దర్శకుడు జీతూ జోసెఫ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. దృశ్యం, దృశ్యం 2, 12th man తర్వాత మోహన్‌లాల్, జీతూ జోసెఫ్‌ల కలయికలో ఇది నాల్గవ సినిమా. ప్రియమణి, అనశ్వర రాజన్ కీలక పాత్రలు పోషించారు. శాంతి మాయా దేవి, జీతూ జోసెఫ్ ఈ చిత్రానికి కథను అందించారు. ఆశీర్వాద్ సినిమాస్ పతాకంపై సంతి ఆంటోని, ఆంటోని పెరుంబవూర్ నిర్మించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌లో మోహన్‌లాల్ 'నేరు