Trump: వెనక్కి తగ్గిన నెట్‌ఫ్లిక్స్..వార్నర్ డీల్‌లో పారామౌంట్‌కు లైన్ క్లియర్
ఈ వార్తాకథనం ఏంటి
ఇటీవల నెట్ ఫ్లిక్స్,వార్నర్ బ్రదర్స్ డిస్కవర్ మధ్య కీలక ఒప్పందం కుదిరినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే ఆ డీల్‌పై అనూహ్య మలుపు తిరిగింది. చివరికి ట్రంప్‌తో సంబంధం ఉన్న పారామౌంట్ స్కైడ్యాన్స్‌కు మార్గం సుగమమైంది. ఇంతకీ ఏం జరిగిందంటే..? Warner Bros. Discoveryకు చెందిన టీవీ నెట్‌వర్క్‌లు, సినిమా స్టూడియోలు, స్ట్రీమింగ్ విభాగాన్ని స్వాధీనం చేసుకునేందుకు Netflixతో పాటు Comcast Corporation మరియు Paramount పోటీ పడ్డాయి. ఈ బిడ్డింగ్ పోటీలో ప్రారంభ దశలో డిస్కవరీ యాజమాన్యం నెట్‌ఫ్లిక్స్ వైపు మొగ్గుచూపింది. సంస్థ కొనుగోలుకు సంబంధించి తాత్కాలిక అంగీకారం కూడా ఏర్పడింది.
వివరాలు
వైట్ హౌస్‌ను సందర్శించిన నెట్‌ఫ్లిక్స్ సీఈఓ
అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు,అలాగే పారామౌంట్ అధిక మొత్తాన్ని ప్రతిపాదిస్తూ 'హాస్టైల్ బిడ్' ఇవ్వడం వల్ల పరిస్థితి మారిపోయింది. సాధారణంగా యాజమాన్యం అనుకూలంగా లేకపోతే,కంపెనీ వాటాదారులను నేరుగా లక్ష్యంగా చేసుకుని ఇలాంటి హాస్టైల్ ఆఫర్లు ఇస్తారు. నెట్‌ఫ్లిక్స్‌తో జరిగిన తాత్కాలిక ఒప్పందం ప్రకారం ఒక్కో షేర్ ధర 28డాలర్లుగా నిర్ణయించగా, పారామౌంట్ 30డాలర్ల ప్రతిపాదనతో ముందుకొచ్చినట్లు సమాచారం. ఈ ఆఫర్ సంస్థ ప్రయోజనాలకు అనుకూలమని డబ్ల్యూబీడీ గురువారం స్పష్టంచేసింది. చర్చల సందర్భంలో నెట్‌ఫ్లిక్స్ సీఈఓ టెడ్ సరండోస్ వైట్ హౌస్‌ను సందర్శించడం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన భేటీ అనంతరం వచ్చిన ప్రకటనతో డీల్ దిశ మారినట్లు స్పష్టమైంది.చివరికి ఈ కొనుగోలు ప్రక్రియ నుంచి తప్పుకుంటున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది.
వివరాలు
స్కైడ్యాన్స్ ఆధీనంలోకి CNN, కేబుల్ వ్యాపారం, HBO వంటి విభాగాలు
కొత్త ఒప్పందం అమల్లోకి వస్తే CNN, కేబుల్ వ్యాపారం, HBO వంటి విభాగాలు స్కైడ్యాన్స్ ఆధీనంలోకి వెళ్లే అవకాశం ఉంది. ఇవన్నీ Larry Ellison కుటుంబ నియంత్రణలోకి రావచ్చని చెబుతున్నారు. దీంతో రెండు ప్రధాన హాలీవుడ్ స్టూడియోలు ఒకే వేదికపై చేరనున్నాయి. అలాగే స్ట్రీమింగ్ రంగంలో HBO Max మరియు పారామౌంట్ ప్లాట్‌ఫారమ్‌లు, వార్తా రంగంలో CNN, CBS కలిసి పనిచేసే పరిస్థితి ఏర్పడవచ్చు. అయితే ఈ విలీన ఒప్పందం అమెరికా సహా ఇతర దేశాల్లో యాంటీ-ట్రస్ట్ చట్టాల ప్రకారం కఠిన పరిశీలనకు లోనయ్యే అవకాశముంది.