
Lucky Baskhar OTT Release: ఓటీటీలోకి 'లక్కీ భాస్కర్' .. విడుదల తేదీ ప్రకటించిన నెట్‌ఫ్లిక్స్
ఈ వార్తాకథనం ఏంటి
దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన 'లక్కీ భాస్కర్' చిత్రం, వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కింది.
దీపావళి సందర్బంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రం ఓటిటిలో విడుదలకు సిద్ధమైంది.
నెట్ ఫ్లిక్స్ ద్వారా నవంబర్ 28 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఇది ప్రేక్షకులకు అందుబాటులో ఉంటుంది.
ఈ చిత్రంలో ఒక సాధారణ బ్యాంకు ఉద్యోగి తన కుటుంబాన్ని ఆర్థిక కష్టాల నుంచి బయటపడేసేందుకు తీసుకున్న రిస్క్ గురించి ఈ చిత్రాన్ని రూపొందించారు.
బ్యాంకింగ్ వ్యవస్థ, స్టాక్ మార్కెట్, భారతీయ మధ్యతరగతి మనోభావాలు అన్నీ ఈ సినిమాలో విలీనమవుతున్నాయి.
Details
హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న దుల్కర్ సల్మాన్
దుల్కర్ సల్మాన్ భాస్కర్‌కుమార్ పాత్రలో తన నటనతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
సినిమా నేపథ్య సంగీతం కూడా ప్రేక్షకులను మెప్పించింది. 'లక్కీ భాస్కర్' తెలుగులో దుల్కర్ సల్మాన్‌కి హ్యాట్రిక్ విజయాన్ని అందించింది.
'మహానటి', 'సీతారామం' తర్వాత ఈ చిత్రం ఆయన కెరీర్‌లో మరో పెద్ద విజయంగా నిలిచింది.
దుల్కర్ సల్మాన్ సొంతంగా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి చిత్రంగా ఇది రికార్డు సృష్టించింది.