ఇండియన్ 2 సినిమా డిజిటల్ రైట్స్ కోసం 220కోట్లు?
కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఇండియన్ 2 సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు నెట్ ఫ్లిక్స్ నుండి భారీ ఆఫర్ వచ్చిందని సమాచారం. ఇండియన్ 2 డిజిటల్ హక్కులకు 220కోట్ల రూపాయలు చెల్లించేందుకు నెట్ ఫ్లిక్స్ రెడీగా ఉందని తెలుస్తోంది. అన్ని భాషల హక్కుల కోసం ఇండియన్ 2 బృందానికి 200కోట్లు ఆఫర్ చేసిందని టాక్. ఈ విషయమై అధికారిక సమాచారం రాలేదు కానీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇదిలా ఉంచితే ఇండియన్ వీఎఫ్ఎక్స్ పనుల కోసం దర్శకుడు శంకర్ అమెరికా వెళ్ళారని తెలుస్తోంది.
ఇండియన్ 2 వీఎఫ్ఎక్స్ పనుల్లో బిజీగా శంకర్
లాస్ ఏంజెల్స్ లో వీఎఫ్ఎక్స్ పనుల్లో బిజీగా ఉన్నట్టు ట్విట్టర్ ద్వారా శంకర్ అప్డేట్ ఇచ్చారు. శంకర్ సినిమాల్లో గ్రాఫిక్స్ ఏ రేంజ్ లో ఉంటాయో అందరికీ తెలిసిందే. ఇండియన్ 2 తో పాటు రామ్ చరణ్ హీరోగా గేమ్ ఛేంజర్ సినిమాను కూడా శంకర్ తెరకెక్కిస్తున్నాడు. రెండు సినిమాల షూటింగ్ షెడ్యూల్స్ తో శంకర్ చాలా బిజీగా ఉన్నారు. రెండు సినిమాల షూటింగ్స్ని ఈ సంవత్సరంలో పూర్తి చేసి, వచ్చే సంవత్సరం విడుదల చేయాలని శంకర్ ప్లాన్ చేస్తున్నారు. ఇండియన్ 2 సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్ హీరోయిన్లుగా కనిపిస్తున్నారు. ఇతర కీలక పాత్రల్లో సిద్ధార్థ్, సముద్రఖని, బాబీ సింహా నటిస్తున్నారు.