బ్రో థీమ్ సాంగ్ కాపీ చేసాడంటూ థమన్ పై విమర్శలు
ఈ వార్తాకథనం ఏంటి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న సినిమా టైటిల్ ని నిన్న రిలీజ్ చేసారు. బ్రో అనే పేరును టైటిల్ గా నిర్ణయించి, మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసారు.
ఈ మోషన్ పోస్టర్ వీడియోలో బ్రో అంటూ చిన్నపాటి థీమ్ సాంగ్ వినిపించింది. ప్రస్తుతం ఈ సాంగ్ గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.
సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్, బ్రో పాటను కాపీ చేసాడని అంటున్నారు. అక్షయ్ కుమార్ నటించిన బ్లూ సినిమా టైటిల్ పాటను కాపీ బ్రో పాటను కంపోజ్ చేసాడని అంటున్నారు.
బ్లూ సినిమా పాట వీడియోను సాక్ష్యాలుగా చూపుతూ థమన్ పై ట్రోలింగ్ జరుగుతోంది.
Details
థమన్ పై కామన్ గా కాపీ వార్తలు
థమన్ పై కాపీ విమర్శలు కొత్తకాదు. థమన్ సంగీతం అందించే ప్రతీ సినిమాకు కూడా ఇలాంటి విమర్శలు వస్తుంటాయి. వీరసింహారెడ్డి సినిమాలో జై బాలయ్య పాటను కాపీ చేసాడని అన్నారు.
ఇలా చాలాసార్లు థమన్ పై కాపీ విమర్శలు వచ్చాయి. ప్రతీసారీ సోషల్ మీడియా వేదికగా కాపీ పాటలంటూ ట్రోలింగ్ కూడా జరుగుతుంటుంది. ఈ విషయమై కొన్నిసార్లు థమన్ స్పందించారు కూడా.
అదలా ఉంచితే బ్రో సినిమాకు సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంలో విజయం సాధించిన వినోదయ సీతమ్ చిత్రానికి రీమేఖ్ గా బ్రో సినిమా రూపొందుతోంది.
ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, డైలాగ్స్.. త్రివిక్రమ్ అందిస్తున్నారు. జులై 28వ తేదీన ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని చిత్రబృందం ప్రకటించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
బ్లూ సినిమా సాంగ్ ని పోస్ట్ చేసిన నెటిజన్లు
Rey thaman ga...
— Tonygaaaadu (@tonygaaaadu) May 18, 2023
Just blue teesesi bro add chesav kada.. 😭😭#BRO #PKSDT pic.twitter.com/OxvUmblpC6