Page Loader
Samantha Ruth Prabhu: 'ఎప్పటికీ టాటూలు వేయించుకోకండి'.. ఫ్యాన్స్‌కు సమంత సలహా!
'ఎప్పటికీ టాటూలు వేయించుకోకండి'.. ఫ్యాన్స్‌కు సమంత సలహా!

Samantha Ruth Prabhu: 'ఎప్పటికీ టాటూలు వేయించుకోకండి'.. ఫ్యాన్స్‌కు సమంత సలహా!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 28, 2025
02:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ ప్రముఖ నటి సమంత రుతు ప్రభు టాటూల అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల తన అభిమానులకు ఓ సలహా ఇస్తూ 'ఎప్పటికీ, ఎన్నడూ టాటూ వేయించుకోవద్దంటూ (Never, ever, get a tattoo)' అంటూ స్పష్టం చేశారు. సమంత గతంలో తన శరీరంపై మూడు టాటూలు వేయించుకున్న విషయం తెలిసిందే. వీటిలో రెండు ఆమె మాజీ భర్త నాగ చైతన్యకు సంబంధించినవే కావడం గమనార్హం. మొదటిగా ఆమె తన తొలి చిత్రం 'ఏ మాయ చేశావే' పేరులోని మొదటి అక్షరాలైన YMC అనే టాటూను మెడ వెనుక భాగంలో వేయించుకున్నారు.

Details

టాటులపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ

ఇక రెండో టాటూ 'Chay' అంటే నాగ చైతన్య ముద్దుపేరు - ఆమె పక్కటెముకలపై ఉంది. మూడవ టాటూ మణికట్టు భాగంలో రెండు బాణాల రూపంలో ఉంది. ఈ టాటూ అర్థం 'మీ స్వంత వాస్తవికతను సృష్టించుకోండి' అనే అర్థమొచ్చేలా ఉంది. ఇదే టాటూ నాగ చైతన్య శరీరంపై కూడా ఉందన్న వార్తలు ఉన్నాయి. ఓ ఇన్‌స్టాగ్రామ్ Q\&A సెషన్‌లో ఒక అభిమాని టాటూ గురించి అభిప్రాయం కోరగా, సమంత స్పష్టంగా "ఎప్పటికీ, టాటూ వేయించుకోకండి" అని చెప్పడం విశేషం. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీయగా, చాలామంది అభిమానులు టాటూల విషయంలో తమ దృష్టికోణాన్ని మళ్లీ పరిక్షించుకుంటున్న పరిస్థితి ఏర్పడింది.