Devara: 'దేవర'లో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం.. కొత్త పోస్టర్ విడుదల
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా మాస్ ఎంటర్టైనర్ "దేవర" విడుదలకు సిద్ధమైంది. స్టార్ డైరెక్టర్ శివ కొరటాల తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా,సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. అంటే, దేవర చిత్రం విడుదలకు ఒక నెల మాత్రమే సమయం ఉంది. ఈ సందర్భంలో,ఎన్టీఆర్ కి సంబంధించి ఒక ప్రత్యేక పోస్టర్ విడుదల చేశారు. ఈ కొత్త పోస్టర్‌లో ఎన్టీఆర్ రెండు విభిన్న షేడ్స్‌లో కనిపిస్తుండటం, ఆయన 'దేవర' సినిమాలో డ్యూయల్ రోల్ చేస్తున్నాడా అనే అనుమానాలను కలిగిస్తోంది. అయితే, ఇంతకు ముందే 'దేవర'లో ఎన్టీఆర్ రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు విడుదలైన పోస్టర్ ఈ అంశానికి మరింత మెరుగైన ఇన్సైట్ ఇస్తోంది.
ప్రీ-రిలీజ్ బిజినెస్ దాదాపు రూ.400 కోట్లు
ఎన్టీఆర్ ఈ చిత్రంలో తండ్రి,కొడుకులుగా కనిపిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక, 'దేవర' విడుదలకు ముందు నుంచే భారీ రికార్డులు సృష్టిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ దాదాపు రూ.400 కోట్ల స్థాయిలో జరగడం తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ.130 కోట్ల బిజినెస్ జరిగింది. మిగతా భాషల్లో రూ.50 నుండి 60 కోట్ల బిజినెస్ జరుగుతోంది. ఓవర్‌సీస్ రైట్స్ రూ.27 కోట్లు, ఆడియో రైట్స్ రూ.33 కోట్లు, ఓటీటీ రైట్స్ రూ.155 కోట్ల బిజినెస్ జరగడంతో, మొత్తం ప్రీ-రిలీజ్ బిజినెస్ సుమారు రూ.400 కోట్లు దాటింది. ఈ న్యూస్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.