Page Loader
We love Bad Boys: వాలెంటైన్స్ డే సందర్భంగా "వి లవ్ బ్యాడ్ బాయ్స్" ఫస్ట్ లుక్ విడుదల 
వాలెంటైన్స్ డే సందర్భంగా "వి లవ్ బ్యాడ్ బాయ్స్" ఫస్ట్ లుక్ విడుదల

We love Bad Boys: వాలెంటైన్స్ డే సందర్భంగా "వి లవ్ బ్యాడ్ బాయ్స్" ఫస్ట్ లుక్ విడుదల 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 14, 2024
12:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

నూతన నిర్మాణ సంస్ధ"బి.ఎమ్.క్రియేషన్స్"బ్యానర్ పై శ్రీమతి పప్పుల వరలక్ష్మి సమర్పణలో పప్పుల కనక దుర్గారావు నిర్మిస్తున్న చిత్రం"వి లవ్ బ్యాడ్ బాయ్స్"(We love Bad Boys). రాజు రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. కడుపుబ్బే ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ వాలెంటైన్స్ డే సందర్భంగా చిత్ర బృందం విడుదల చేసింది. అజయ్, వంశీ ఏకశిరి, ఆదిత్య శశాంక్ నేతి, రోమిక శర్మ, రోషిణి సహోట, ప్రగ్యా నయన్, సన్యు దవలగర్, వంశీకృష్ణ, సింధు విజయ్, విహారిక చౌదరి ముఖ్య తారాగణం.

Details 

ఆద్యంతం నవ్వించే కామెడీ ఎంటర్టైనర్: దర్శకుడు 

పోసాని కష్ణమురళి, కాశి విశ్వనాథ్, అలి, సప్తగిరి, పృథ్వి, శివారెడ్డి, భద్రం, గీతాసింగ్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. నేటి ట్రెండ్ కు తగిన కథ-కథనాలతో ఆద్యంతం నవ్వించే కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని చిత్ర దర్శకులు రాజు రాజేంద్ర ప్రసాద్ చెబుతున్నారు. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తమ బ్యానర్ కు శుభారంభం ఇస్తుందనే నమ్మకం ఉందని నిర్మాత పప్పుల కనక దుర్గారావు అన్నారు. అతి త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని పేర్కొన్నారు. రఘు కుంచె"తో కలిసి భూషణ్ జాన్ సంగీతం అందిస్తున్నారు.