Devara: జూనియర్ ఎన్టీఆర్ దేవర రిలీజ్ డేట్ ఇదే
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ యాక్షన్ డ్రామా దేవర ఏప్రిల్ 5, 2024న విడుదల కావాల్సి ఉంది. అయితే, VFX పనుల్లో జాప్యం,సైఫ్ అలీ ఖాన్ గాయం కారణంగా వాయిదా పడింది. జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల శివతో ఎన్టీఆర్ చేస్తున్న రెండో సినిమా దేవర. తాజా సమాచారం ప్రకారం, దేవర: పార్ట్ 1 ఇప్పుడు దసరా పండుగ సమయంలో అక్టోబర్ 10, 2024న పెద్ద స్క్రీన్‌లపైకి రానుంది. మేకర్స్ X పోస్టులో విడుదల తేదీని వెల్లడించారు. తారక్‌కి సంబందించిన పోస్టర్‌ను కూడా ఆవిష్కరించారు.
మరో హీరోయిన్ గా మరాఠీ నటి
కాగా, ఎన్టీఆర్ సూపర్‌హిట్ అరవింద సమేత కూడా 2018లో దసరాకి విడుదలైంది. దేవరాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ టాలీవుడ్ అరంగేట్రం చేస్తుంది. మరాఠీ నటి శృతి మరాఠే కూడా ఈ సినిమాలో మరో హీరోయిన్ గా కనిపించనుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకాలపై నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ .