
SSMB 29 : కొత్త షెడ్యూల్ రెడీ.. టాంజానియాలో అడుగుపెట్టనున్న మహేష్ బాబు టీం!
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ప్రాజెక్టుల్లో ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'SSMB29' చిత్రంపై భారీ స్థాయిలో ఆసక్తి నెలకొంది. సూపర్‌స్టార్ మహేష్‌బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మాస్ అండ్ అడ్వెంచర్ ఎంటర్టైనర్ పాన్-వరల్డ్ సినిమా హంగులతో రూపొందుతోంది. మహేష్ బాబు ఈ సినిమాలో ఇప్పటి వరకు ఎన్నడూ చూడని కొత్త లుక్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అప్డేట్స్‌పై అభిమానుల్లోనూ సినీ వర్గాల్లోనూ భారీ ఉత్సాహం కనిపిస్తోంది. టైటిల్, ఫస్ట్ లుక్, టీజర్ రిలీజ్‌ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకుల్లో ప్రస్తుతం షూటింగ్ విషయాలు హాట్ టాపిక్‌గా మారాయి. తాజా సమాచారం ప్రకారం, చిత్రబృందం తదుపరి షెడ్యూల్‌ను ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.
Details
కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు ప్లాన్
మొదటగా ఈ సినిమా షూటింగ్‌ను కెన్యాలో నిర్వహించాలని భావించినప్పటికీ, అక్కడి పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆ ప్లాన్‌ను మార్చిన దర్శకుడు రాజమౌళి సారథ్యంలోని బృందం, ఇప్పుడు టాంజానియాలో ఉన్న అద్భుతమైన ప్రకృతి నేపథ్యాల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు సిద్ధమవుతోంది. ఇక సినిమాకు సంబంధించిన ఒక్క అధికారిక ప్రకటనను కూడా విడుదల చేయకుండా.. అంతటా గోప్యతను కొనసాగిస్తూ షూటింగ్‌ను శరవేగంగా నిర్వహిస్తున్నారు జక్కన్న. ఈ గోప్యత అభిమానుల్లో అంచనాలను మరింత పెంచేస్తోంది.
Details
హీరోయిన్ గా ప్రియాంక చోప్రా
ఈ మాస్ యాక్షన్ అడ్వెంచర్ మూవీలో బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌తో పాటు ఇతర అంతర్జాతీయ ప్రముఖ నటీనటులు కూడా భాగమయ్యే అవకాశముందని సమాచారం. సుమారు రూ.1000 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ ప్రాజెక్టు భారతీయ సినిమా చరిత్రలో మరో గొప్ప ఘట్టంగా నిలిచే అవకాశం కనిపిస్తోంది. 'RRR'తో గ్లోబల్ గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి.. ఇప్పుడు 'SSMB29'తో మరింత పెద్ద స్థాయిలో భారత సినిమాను ప్రపంచానికి పరిచయం చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నారని వర్గీయ సమాచారం.