LOADING...
Akhil : అఖిల్ 'లెనిన్' మూవీపై కొత్త అప్‌డేట్.. బాలీవుడ్ బ్యూటీ అనన్య స్పెషల్ సాంగ్ ప్లాన్
అఖిల్ 'లెనిన్' మూవీపై కొత్త అప్‌డేట్.. బాలీవుడ్ బ్యూటీ అనన్య స్పెషల్ సాంగ్ ప్లాన్

Akhil : అఖిల్ 'లెనిన్' మూవీపై కొత్త అప్‌డేట్.. బాలీవుడ్ బ్యూటీ అనన్య స్పెషల్ సాంగ్ ప్లాన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 01, 2025
10:42 am

ఈ వార్తాకథనం ఏంటి

అక్కినేని అఖిల్ హీరోగా పరిచయమైనప్పటి నుంచి ఇప్పటివరకూ అతనికి చెప్పదగ్గ సాలిడ్ హిట్ రావలేదు. అనేక ఆశలతో మొదలైన ప్రయాణంలో, అతని 'ఏజెంట్' సినిమా టాలీవుడ్‌లో పెద్ద డిజాస్టర్‌గా మారింది. ఈ అసంపూర్ణ విజయాన్ని తట్టుకుని, అఖిల్ తన తదుపరి ప్రాజెక్టుకు ఎక్కువ సమయం కేటాయించాడు. ఈసారి అతను దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరితో కలిసి రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో ఒక విలేజ్ లవ్ స్టోరీని తెరపైకి తెస్తున్నాడు. ఈ సినిమాకు 'లెనిన్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో అఖిల్ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. మేకర్స్ నవంబర్ 14న ఈ సినిమా విడుదల చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

Details

త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం

ఇప్పటి వరకు విడుదలైన ప్రతి అప్‌డేట్ ఈ సినిమాపై మంచి హైప్‌ను పెంచింది. చిత్తూరు ప్రాంతం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అఖిల్ చిత్తూరు యాసలోనే మాటాడబోతున్నాడు. అతను గతంలో మిల్క్ బాయ్ లాంటి ఇమేజ్ కలిగి ఉండగా, ఈసారి కాస్త డిగ్లామర్ లుక్‌లో కనిపించనున్నాడు. మొత్తానికి అఖిల్ ఈ సినిమా కోసం గట్టిగా కష్టపడుతున్నాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మేకర్స్ ఓ స్పెషల్ సాంగ్‌ను ప్లాన్ చేస్తున్నారు. ఈ పాటకు బాలీవుడ్ క్రేజీ బ్యూటీ అనన్య పాండేను తీసుకొచ్చేందుకు యోచిస్తున్నారు. ఈ వార్తలో ఎంత వాస్తవం ఉందో త్వరలోనే తెలుస్తుందని అంటున్నారు.